బుల్లి పిట్ట: మొబైల్ నెంబర్ పోర్టింగ్ ఎన్నిసార్లు చేయవచ్చో తెలుసా..?

Divya
మనం ఏదైనా నెట్వర్క్ నుంచి సిగ్నల్ ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోతే.. కచ్చితంగా మనం ఇతర నెట్వర్క్ కి మారుతూ ఉంటాము.. ఒక వేళ ఆఫర్లు నచ్చకపోయినా రీఛార్జ్ ప్రైస్ ఎక్కువగా ఉన్న ఇతర నెట్వర్క్ కి మారడం వంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సిమ్ కార్డుని మనం ఎన్నిసార్లు పోర్టు చేసుకోవచ్చనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళితే కొత్త MNP లేదా మొబైల్ నెంబర్ కి నియమాల ద్వారా కస్టమర్ ఎలాంటి సమస్యలు లేకుండా తన నెంబర్ ని ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ మారవచ్చు. ఈ క్రమంలోనే వీరు ఎన్నిసార్లు అయినా సరే సిమ్  పోర్టు చేసుకొనే అవకాశం కలదు. దీనికి ఒక పరిమితి అంటూ కూడా లేదు.. అయితే మనం ఎంచుకున్న నెట్వర్క్ సేవలు నచ్చనట్లు అయితే వారి సేవలతో మనం సంతృప్తి చెందకపోయినా వెంటనే ఇతర నెట్వర్కులకు పోర్ట్ అవ్వవచ్చు. కానీ మీ మొబైల్ నెంబర్ పోర్ట్ చేయాలంటే ముందుగా పలు విషయాలను సైతం గుర్తుంచుకోవాలి.

మొబైల్ నెంబర్ ని మరో నెట్వర్క్ కి మార్చాలనుకుంటే ముందుగా పాత నెట్వర్క్ లో సిమ్ కార్డు పైన ఉన్న బకాయిలను మొత్తం తీర్చి వేయాలి. ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తమ సిమ్ముపై ఎలాంటి బకాయిలు ఉండకూడదు..ఒక వేళ అలా బకాయిలు ఉంటే పోర్టింగ్ అనేది సాధ్యపడదు. అలాగే ఏదైనా నెట్వర్క్ కి పోర్ట్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న నెట్వర్కులో కనీసం మూడు నెలల వ్యవధి పాటు ఉండాలి. అలాకాకుండా మరో నెట్వర్క్ కి పోర్ట్ అవ్వాలి అంటే అది సాధ్యపడదు. అందు చేతనే ప్రతి ఒక్కరు పోర్టింగ్ అయ్యేటప్పుడు ఈ విషయాలను సైతం కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. పోర్టు మాత్రం ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: