బుల్లి పిట్ట: రియల్ మీ నుంచి 5జి మొబైల్.. ధర ఫీచర్స్ ఇవే..!!
రియల్ మీ 10-5 జి మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.6 అంగుళాలు కలిగిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో కలదు. ఈ మొబైల్ బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సల్ కలదు. వీటితోపాటు త్రిబుల్ కెమెరా ఫీచర్ కూడా కలదు. ముఖ్యంగా బ్యాటరీ విషయానికి వస్తే ..5000 mah సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుందట. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 33 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ 50% చార్జింగ్ కేవలం 30 నిమిషాలకు చార్జింగ్ అవుతుందని రియల్ మీ సమస్త తెలియజేస్తోంది.
రియల్ మీ మొబైల్ 8 GB+128 GB స్టోరేజ్ వేరియంట్ మొబైల్ చైనాలో 1299 ఇవాన్లుగా నిర్ణయించడం జరిగింది. అయితే మన భారతదేశంలో రూ.14,700 రూపాయలకు లభిస్తుంది.8 GB RAM+256 GB మెమొరీ కలిగిన మొబైల్ ధర మాత్రం రూ 18,000 రూపాయలకి లభించబోతున్నట్లు తెలుస్తోంది. చైనాలో మాత్రం ఈ మొబైల్ కలర్లలో బ్లాక్ కలర్ ,స్టోన్ క్రీటల్, రీజిన్ డౌజీన్ వంటి వాటిలో మాత్రమే లభిస్తుంది. తాజాగా ఈ మొబైల్ 5g వేరియంట్ లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. అయితే ఎప్పుడు వస్తుందని తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇటీవల రియల్ మీ 10 4G మొబైల్స్ కూడా మార్కెట్లోకి విడుదలయ్యాయి.