బుల్లి పిట్ట: ఈ మొబైల్ ఫ్యూచర్లో తెలిస్తే మతిపోవాల్సిందే..!!

Divya
మొబైల్ ఫోన్స్ తీసుకునే వారికి తాజాగా ఒక గుడ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ రంగంలో తన సంచలనం సృష్టిస్తుంది మోటరోలా . అయితే ప్రతి ఒక్కరూ కొత్త మొబైల్ కొనాలి అంటే ఎక్కువగా ర్యామ్ తోపాటు, కెమెరా మెగాపిక్ సెల్ ఎంత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు కెమెరా ఫిక్సలులో 50MEGA,64MEGA,108 MEGA ..మెగాపిక్ సెల్ తో కెమెరా ఫ్యూచర్లతో మార్కెట్లోకి విడుదలవడం జరిగాయి. అయితే మొదటిసారిగా 200 మెగా ఫిక్సెల్ తో మొబైల్ విడుదల కాబోతోంది. అదే అమెరికన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ సమస్త మోటరోలా అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో పాటు రెండు మొబైల్ ని ఇండియాలో గ్రాండ్గా విడుదల చేయనుంది. ఈ రెండు మొబైల్స్ ని సెప్టెంబర్ 13న భారత్ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని మోటరోలా సంస్థ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ని ఒకసారి మనం తెలుసుకుందాం.

మోటరోలా ఎడ్జ్ -30 ప్రత్యేకతలు ఇవే..
1). క్వాల్ కామ్ పవర్ఫుల్ స్నాప్ డ్రాగన్ 8+1 ప్రాసెస్ తో పాటు..30 అల్ట్రా త్రిబుల్ కెమెరా కలదు.
2).200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు..50 మెగాపిక్ సెల్ సెన్సార్, 12 మెగాఫిక్ సెన్సార్, సెల్ఫీ ప్రియుల కోసం 60 మెగా ఫిక్సెల్ కెమెరాను సెట్ చేయడం జరిగింది.

3). ఇక డిస్ప్లే విషయానికి వస్తే..6.7 అంగుళాల oled  డిస్ప్లే తో కలదు.
4). ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4160 MHA సామర్థ్యం తో పాటు 125 వాట్సప్ ఛార్జింగ్ సపోర్ట్ వైర్లెస్ చార్జింగ్ కూడా చేస్తుందట. మరెన్నో ఫీచర్లతో ఈ మొబైల్ ని తయారు చేసి విడుదల చేయడం జరుగుతోంది.
ఇందులోనే రెండు రకాల స్మార్ట్ మొబైల్స్ ని విడుదల చేసింది. అయితే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ.48,000 రూపాయలు ఉండవచ్చట. అయితే ఇందులో మూడు కలర్లు గల మొబైల్స్ మాత్రమే విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: