ఆటోమేటిక్‌ సైంటిఫిక్‌ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ : రెడీ!

ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం నగరంలోని జిల్లా రవాణా కార్యాలయంలో ఆటోమేటిక్‌ సైంటిఫిక్‌ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ సిద్ధమవుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఇటువంటి టెస్టింగు ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో అనంతపురం నగరంలోని జిల్లా రవాణా కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్న ఈ డ్రైవింగు టెస్టు ట్రాక్‌ గురించి జిల్లా రవాణా అధికారి అయిన శివరాం ప్రసాద్‌ వివరించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఆధునిక సాంకేతిక పద్దతుల్లో ట్రాక్‌ మొత్తం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉంటుంది. అలాగే డ్రైవింగు లైసెన్సు పొందేవారు ఈ ట్రాక్‌లో డ్రైవింగు పరీక్ష ఉత్తీర్ణత అవ్వాల్సి ఉంటుంది.రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ ట్రాక్‌లో మొత్తం ఎనిమిది పాయింట్లు అనేవి ఉంటాయి. ఇక తొలి పాయింట్‌ ప్రారంభమైన తరువాత ఎనిమిదో క్రాస్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాత హెచ్‌ క్రాస్‌లో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. ఆ తరువాత పార్కింగ్‌ పార్లలల్‌లో వాహనాన్ని ఉంచాలి.ఆ తరువాత స్పీడ్‌ బ్రేకర్లు ఆ తరువాత కర్వ్‌ ముందు సిగల్‌ వద్ద వాహనాన్ని ఆపాలి. అటు తరువాత పైకి వెళ్లి డ్రైవింగుని పూర్తి చేయాలి. ప్రతీ పాయింట్‌ వద్ద కూడా కెమెరాతోపాటు సెన్సార్లు ఉంటాయి. 


ఈ డ్రైవింగ్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ముందే పరీక్షకు హాజరయ్యేవారు కియోస్కోలో వేలిముద్ర వేసి నమోదు చేసుకున్న తరువాత వాహనానికి ఒక ట్యాగ్‌ను అమరుస్తారు. ఈ ట్యాగ్‌ అనేది సెన్సార్లకు రెస్పాండ్‌ అవుతుంది. ఇక ఈ సెన్సార్ల నుంచి సాంకేతాలు ప్రతిదీ సాంకేతిక గదిలోనున్న కంప్యూటర్లకు చేరుతుంది. ఈ మొత్తం పరీక్ష పూర్తవగానే రెండు నిమిషాల వ్యవధిలో డ్రైవింగు పరీక్షకు సంబంధించిన ఫలితం పరీక్షకు హాజరైన వ్యక్తి మొబైల్‌ వాట్సప్‌కు సమాచారం అనేది వచ్చేస్తుంది. అందులో తప్పిదాలు ఎక్కడ చేశారో కూడా వివరంగా ఓ వీడియో రూపంలో ఉంటుంది. ఇలా పూర్తి స్థాయి సాంకేతికతో ఈ ట్రాక్‌ అనేది ఉండనుంది. కానీ ఇప్పటి వరకు అయితే మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టరు డ్రైవింగును పరీక్షించి లైసెన్సు మంజూరు చేసేవారు. అయితే ఇప్పుడు నేరుగా సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్‌ ద్వారానే లైసెన్సు మంజూరు ఆధారపడి ఉంటుంది.ఇది వచ్చే నెలలో ప్రారంభమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: