వాహనదారులకు బంపర్ ఆఫర్... డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు ?

VAMSI
నేటి కాలంలో మనము ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే... చిన్న దూరాలు అయితే కాలి నడకన వెళ్ళవచ్చు. కానీ కొంచెం పెద్ద దూరం అయినా, లేదా కొంచెం అర్జెంటు పని అయినా తప్పక బైక్ లు వాడడం తప్పనిసరి. ఇంకొందరు అయితే వాహనాలు లేకుండా కాలు బయటకు పెట్టడం కూడా కష్టమే. అయితే బండి బయటకు తీయాలంటే భయం. నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఓ వైపు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యుషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్స్‌ లేకపోతే చలానాలు మరో వైపు... ఇలా బాదుడే బాదుడు ఆఫర్ లో ఎక్కడా చిక్కుకుంటామో తెలియదు. అయితే ఇపుడు కొంతలో కొంత ఒక గుడ్ న్యూస్ వినపడుతోంది. ఇకపై ఈ డాక్యుమెంట్స్ తో పెద్దగా చిక్కులేదు అని వినిపిస్తోంది.
మాములుగా ఈ వాహన పత్రాలలో ఏవి లేకపోయినా లేదా మనతో బయటకు తీసుకురావడం మరచిపోయినా ఇక మన జేబులకు చిల్లే.. కానీ ఇప్పుడు ఆ చింత లేకుండా రాష్ట్ర రవాణాశాఖ వాహనదారులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది అని సమాచారం. ప్రస్తుతం ఉన్న డిజిటల్ రంగాన్ని వినియోగించుకుని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.  బండి డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒకే చోట ఉండేలా ఓ యాప్ ను రెడీ చేస్తున్నారట రవాణా శాఖ అధికారులు. ఆ యాప్‌లో సదరు వాహన దారుడు బండి నెంబర్, ఫోన్ నెంబర్‌ను నమోదు చేస్తే చాలు.. మొత్తం వాహన డాక్యుమెంట్స్ అన్ని కూడా అందులో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటాయి.  
అవసరమైనపుడు వాటిని చూపించవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటే ఇకపై ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఎపుడు ఏ డాక్యుమెంట్స్  అడుగుతారేమో ఏవి మరచిపోతామేమో అని కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ మధ్యలో ఆపినా .. యాప్ ద్వారా వాటిని వెంటనే చూపించే సౌకర్యం అందుబాటులోకి రానుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: