ఐఫోన్ బ్యాటరీ లైఫ్ ని సేవ్ చెయ్యాలంటే ఎలా?

ఇక ఐఫోన్ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవడానికి వినియోగదారులు తక్కువ పవర్ మోడ్‌ని ఉపయోగించుకునే మార్గం కూడా ఉంది. ఫోన్ బ్యాటరీ ఛార్జ్ 20 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు వారు తక్కువ పవర్ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇక్కడ మీ ఐఫోన్‌ను తక్కువ పవర్ మోడ్‌కు మీరు సెట్ చేయవచ్చు. ఇది కాకుండా ఐఫోన్ వినియోగదారులు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ ఫీచర్‌ను కూడా ఆఫ్ చేయాలి. ఇక ఎప్పుడు గానీ.. ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో వంద శాతం కంటే తక్కువగా ఛార్జ్‌ ని చేసుకోవాలి.ఎక్కువ కాలం ఐఫోన్ వాడిన తర్వాత బ్యాటరీ ఆరోగ్యం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇక అందుకు మీరు మీ iPhoneలో బ్యాటరీ లైఫ్‌ పరిస్థితిని సులభంగా తెలుసుకోవచ్చు. దీన్ని తెలుసుకోవాలంటే మీరు ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సిందే. సెట్టింగ్‌లు > బ్యాటరీ >కి వెళ్లండి బ్యాటరీ లైఫ్ ని చెక్ చేయవచ్చు. చాలా మంది కూడా తమ ఫోన్‌లను రాత్రిపూట ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇది అత్యంత అనుకూలమైన టైం కాబట్టి. ఇలా ఫోన్‌ను ఓవర్‌ఛార్జ్ చేయడం వల్ల మీ బ్యాటరీ దెబ్బతింటుంది. దీని కారణంగా మీ ఫోన్ లైఫ్ టైం తగ్గిపోతుంది.


ఒక్కసారి బ్యాటరీ హెల్త్ పర్సెంటేజీ పడిపోతే బ్యాటరీ హెల్త్‌ని మళ్లీ 100 శాతానికి పెంచలేమని యూజర్లు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది కాకుండా, బ్యాటరీ దెబ్బతిన్నట్లయితే మరో బ్యాటరీని మార్చడం తప్ప వేరే మార్గం అనేది లేదు.ఖచ్చితంగా ఒరిజినల్ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయండి. మీరు మరొక ఛార్జర్‌ను కనుక ఉపయోగిస్తే, ఇది మీ ఫోన్ బ్యాటరీపై చెడు ప్రభావాన్ని కూడా చూపుతుంది. అలాగే ఫోన్ బ్యాటరీని పదేపదే ఛార్జ్ చేయడం వలన ఫోన్ బ్యాటరీ జీవితం తగ్గే ఛాన్స్ లు పెరుగుతాయి. మీ బ్యాటరీకి సరైన ఒకే రకమైన పవర్ బ్యాంక్‌ను ఎల్లప్పుడూ వాడండి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. బ్యాటరీని ఆదా చేయడానికి లేదా ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేయడానికి థర్డ్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించకపోవడమే చాలా మంచిది. ఈ యాప్స్ మీ ఫోన్ బ్యాగ్రౌండ్ లో నడుస్తాయి. ఇది బ్యాటరీపై మరింత ఒత్తిడిని కూడా కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: