బుల్లి పిట్ట: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే 20% క్యాష్ బ్యాక్..!

Divya
రిలయన్స్ జియో.. దేశంలోని అన్ని టెలికాం సంస్థలతో పోటీపడుతూ బాగా అభివృద్ధి చెందుతున్న సంస్థ అని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య అన్ని టెలికాం సంస్థ లతో పాటుగా రీఛార్జి రేట్లను కూడా పెంచి వినియోగదారులకు కొంత నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు jio కస్టమర్లకు ఒక శుభవార్త ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో.. అదేమిటంటే రీఛార్జి రేట్లు పెంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది.. ఇప్పటికే వోడాఫోన్ , ఎయిర్టెల్ , ఐడియా తో పాటు జియో కూడా తన ప్లాన్ రీఛార్జి రేటు పెంచి అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం తెలిసిందే.
20% క్యాష్ బ్యాక్ తో కొన్ని ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. మీకు నగదు రూపంలో కాకుండా రీడీమ్ పాయింట్స్ గా జమ అవుతాయి. ఇక మీరు అవసరం ఉన్నప్పుడు రీఛార్జ్ జియో మార్ట్  లేదా జియో స్టోర్ లలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక అంతే కాదు జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ ను కూడా ఆఫర్ చేస్తూ అన్లిమిటెడ్ ప్లాన్స్ అలాగే హై స్పీడ్ డేటా వంటి లాభాలను కూడా మీరు పొందవచ్చు.
ఇక ప్లాన్ల విషయానికి వస్తే.. రూ.299 ప్లాన్:
ఈ ప్లాన్ మీకు అన్ని నెట్ వర్క్ లకు కూడా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు డైలీ 2 జిబి డేటా 28 రోజుల పాటు వస్తుంది అంటే, మొత్తం 56 జీ బీ హై స్పీడ్ డేటా ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఒక రోజుకు 100 ఎస్ఎంఎస్ లిమిట్ కూడా మీరు అందుకోబడతారు. ఇకపోతే జియో యాప్స్ కి సంబంధించి ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. పైగా 20 % జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది.
రూ.666 ప్లాన్ :
ఈ ప్లాన్ తో మీరు 1.5 జీబీ డేటా రోజు వారి పొందవచ్చు.. అంటే 84 రోజులు వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ తో 126gb హై స్పీడ్ డేటా ను పొందవచ్చు . రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉపయోగించుకోవచ్చు. ఇక పైగా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 20% జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: