మైక్రోసాఫ్ట్ బిగ్ అప్డేట్... "విండోస్ 11" ఎప్పుడంటే ?

Vimalatha
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి విండోస్ 11 ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వారి నిరీక్షణకు చెక్ పెడుతూ తాజాగా మైక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల తేదీని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం విండోస్ 11 అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. మరో సంతోషించాల్సిన విషయం ఏమంటే విండోస్ 10 ఉపయోగిస్తున్న వారు దీనిని ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
అయితే విండోస్ 11ను ఇప్పటికే విండోస్ టెన్ వాడుతున్న వారు మాత్రమే అప్ గ్రేడ్ చేసుకోగలరు.
విండోస్ 11ను అక్టోబర్ 5 నుంచి రిలీజ్ చేయనున్నారు. అయితే అక్టోబర్ 5 నుంచి ప్రతి యూజర్ అప్ గ్రేడ్ చేసుకోలేరు. ఎందుకంటే సాధారణంగా కంపెనీ అప్ గ్రేడ్ ను దశల వారీగా విడుదల చేస్తుంది. కాబట్టి కొంత మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
 
ప్రారంభంలో కొత్త హార్డ్వేర్ తో కొత్త విండోస్ టెన్ కంప్యూటర్లు అప్ గ్రేడ్ అవుతాయి ఆ తర్వాత కంపెనీ తన పరిధి విస్తరిస్తుంది. మరో విషయం ఏమిటంటే విండోస్ 11 ఒరిజినల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. పైరేటెడ్ వెర్షన్ ఉపయోగించే వాళ్లకు కాదు.
కంపెనీ విండోస్ టెన్ నుంచి చాలా నేర్చుకుంది. అందుకే విండోస్ సెవెన్ లో తమ యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామని మైక్రోసాఫ్ట్ వారు తెలిపారు. 2022 నాటికి విండోస్ లో అన్ని అర్హతలు కలిగిన పరికరాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇప్పటికే మీరు విండోస్ 11 కంప్యూటర్ ను ఉపయోగిస్తుంటే అక్టోబర్ 5 తర్వాత మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావొచ్చు. కంప్యూటర్ అప్డేట్ సెట్టింగ్ లోకి వెళ్లి ఇన్ని మాన్యువల్ గా కూడా తనిఖీ చేయవచ్చు. దీనికి కంపెనీ పీసీ హెల్త్ చెకప్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది.
విండోస్ 11 లో ఇంకా చాలా అప్డేట్ ఉండబోతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే వెర్షన్ లో మాత్రం కొన్ని ఫీచర్లు ఉండకపోవచ్చు.
ఉదాహరణకు ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్ విండోస్ 11 లో అందుబాటులో ఉంది. తర్వాత కంపెనీ దాన్ని ఆపరేటింగ్ సిస్టం సాధారణ అప్డేట్ గా జోడిస్తుంది.
దీనిని అప్ గ్రేడ్ చేసుకోవాలంటే విండోస్ టెన్ లో ఉపయోగించడమే కాకుండా కంప్యూటర్ లో 64 బిట్, 1 ghz కలిగి ఉండాలి. అంతేకాకుండా 4gb ram, 64gb స్టోరేజ్ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: