త్వరలో విడుదల కానున్న అప్ డేటెడ్ స్కోడా కొడియాక్..

ఇక ఈ సంవత్సరం జూన్ నెలలో తమ కొత్త కుషాక్ ఎస్‌యూవీ కార్ ని విడుదల చేసిన చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో , ఇప్పుడు ఇండియా మార్కెట్లో తమ అప్‌డేట్ కొడియాక్ ఎస్‌యూవీ కార్ ని విడుదల చేయడానికి రెడీగా ఉంది. కొత్త స్కోడా కొడియాక్ అప్‌డేటెడ్ డిజైన్, ఇంజన్ ఇంకా ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. BS6 పెట్రోల్ ఇంజన్‌తో రానున్న ఈ కొత్త స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీని డెలివరీలు మాత్రం వచ్చే సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా. ఇక ఈ ఏడాది జూన్ నెలలో తమ అప్‌డేటెడ్ స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ కార్ ని కంపెనీ ఆవిష్కరించడం జరిగింది.ఇక ఇటీవల పలు సందర్భాల్లో స్కోడా కంపెనీ ఈ కారును ఇండియన్ రోడ్లపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేయటం కనిపించడం జరిగింది.

కవర్ లేకుండా టెస్ట్ చేసే మోడళ్లలో ఎస్‌యూవీ అనేకసార్లు కనిపించడం జరిగింది.నిజానికి కంపెనీ గత సంవత్సరమే ఈ స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా దాని విడుదల వాయిదా పడటం జరిగింది.ఇక ఇండియాలో కఠినమైన BS6 ఉద్గార నిబంధనలను అమలు చేసిన తర్వాత స్కోడా కంపెనీ తమ డీజిల్ మోడళ్లను నిలిపివేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త BS6 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేయబడుతుందని సమాచారం అందుతుంది. ఇక ఈ ఇంజన్ ఎక్కువగా 187 బిహెచ్‌పి పవర్‌ను ఇంకా 320 న్యూటన్ మీటర్ టార్క్ ని ఉత్పత్తి చేయడం జరిగింది.ఇక ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులోకి రాబోతుంది. ఇక ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక దీని పెర్ఫార్మెన్స్ విషయానికి ఈ కారు కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: