ముసురుతో వణుకుతున్న తెలంగాణ.. నిండుకుండలా ప్రాజెక్టులు..?

MOHAN BABU
తెలంగాణ వ్యాప్తంగా  గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, అన్నీ నిండుకుండలా మారిపోయాయి. వాగులన్ని పొంగుతూ రహదారులు మూతపడ్డాయి. హైదరాబాద్ పరిస్థితి చెప్పనవసరం లేదు. చిన్న వర్షం పడితేనే పెద్ద పెద్ద వరదలు వస్తాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడ వరదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతూ  చాలామంది ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ తో పాటుగా  దీని పరిధిలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్  వంటి ప్రాంతాలలో వర్ష ప్రభావం ఇంకా ఎక్కువగా ఉన్నది.

 గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుంది. మట్టి  రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు.  బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడినదని వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో రాబోవు మరో మూడు రోజులు రాష్ట్రం మొత్తం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని  హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి నిండుకుండలా కనిపిస్తున్నాయి.

 శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్  ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి వచ్చే నీటితో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా తయారయింది. దీంతోపాటుగా నిర్మల్ కడెం ప్రాజెక్టులోకి కూడా భారీగా నీరు చేరింది. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు అన్నీ పోటెత్తుతున్నాయి. జాలరుల ఎవరూ వేటకు వెళ్లొద్దని, ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రభుత్వాలకు సందేశాలను పంపుతోంది. దీంతో  అలర్ట్ అయిన ప్రభుత్వాలన్నీ  ఏదైనా ప్రమాదం ఏర్పడితే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో రైతులంతా పొలలన్ని దున్ని  నాటడానికి సిద్ధంగా చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతోంది. ప్రమాద నివారణ హెచ్చరికలు జారీ చేస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: