ఇక సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ఫేస్‌బుక్ కంటెట్ క్రియెటర్లపై దృష్టి సారించడం జరిగింది. 2022వ సంవత్సరం చివరి నాటికల్లా కంటెంట్ క్రియేటర్లను సపోర్ట్ చేస్తూ ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్బుక్ బుధవారం ప్రకటించడం జరిగింది. ఇక టిక్ టాక్ అలాగే యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక అలాగే పోటో షేరింగ్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఫేస్‌బుక్ యాప్స్ లలో కొన్ని టార్గెట్లు ఇంకా మైలురాళ్లను అధిగమించిన కంటెంట్ క్రియేటర్లకు బోనస్ చెల్లించడానికి ఇంకా కంటెంట్ ప్రొడ్యూస్ చేసే యూజర్లకు నిధులు సమకూర్చడానికి ఈ పెట్టుబడులను కేటాయిస్తున్నట్లు సంస్థ పేర్కొనడం జరిగింది.
ఇక ఫేస్‌బుక్‌లో వీడియో క్రియేటర్లు ఇంకా ఆన్ లైన్ గేమర్లు డబ్బులు కోసం కొన్ని టార్గెట్స్‌ను రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా రీచ్ అయితే ఇక వీరికి నెలవారీ బోనస్ అనేది అందుతుంది.ఇక ఇది వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఫ్యాన్స్ తమ క్రియేటర్లకు చెల్లించడానికి వాడగల డిజిటల్ టిప్పింగ్ రూపంలో ఉంటుందట. ఇన్‌స్టాగ్రామ్ బోనస్ ప్రోగ్రామ్స్‌లో రీల్స్ ను వాడేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి.ఇక అలాగే వీడియోల ప్రభావం ఇంకా పనితీరు ఆధారంగా కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదిస్తారని కంపెనీ స్పష్టం చేయడం జరిగింది.ఇక ఈ మధ్యనే రిలయెన్స్ జియోలో రూ.43,574 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్బుక్ ఈ డీల్ కుదుర్చుకుందట. ఇక తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఏజీఎం సమావేశంలో గూగుల్ పెట్టుబడుల గురించి ముఖేష్ అంబానీ ప్రకటించడం జరిగింది.టెక్ కంపెనీ గూగుల్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుందట.