బుల్లిపిట్ట: పీఎఫ్ మనీ విత్ డ్రా చేయడం ఎలా..?

Divya
 ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగిన ఖాతాదారులు మీ డబ్బులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారికి ఈపీఎఫ్ఓ సంస్థ శుభవార్త తెలిపింది. మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బులను అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది. సాధారణంగా ఈ పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలి అంటే సరైన కారణం చూపించాల్సి ఉంటుంది. అందులోనూ పెళ్లి వంటి శుభకార్యాలకు, ఇంటి నిర్మాణాలకు మాత్రమే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించబడినది. కానీ ప్రస్తుతం కరోనా ఉద్రిక్తత కారణంగా ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఆర్థికంగా నష్టపోయిన వారికి, అలాగే కోవిడ్ బారిన పడి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని వారికి, మీ పిఎఫ్ ఖాతాల ద్వారా అడ్వాన్స్ రూపంలో డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా ఈ పీఎఫ్ అకౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళు కొవిడ్-19 సర్టిఫికెట్ చూపించి, డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ పీఎఫ్ అకౌంట్ లో నుంచి మూడు నెలల బేసిక్ సాలరీ అలాగే డి ఏ నుంచి 70 శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం మీరు చేయవలసిందల్లా..

1).మీ యూ ఏ ఎన్ (UAN) నంబర్ ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసి ఉండాలి.
2).ఇక అంతే కాకుండా మీ ఆధార్ నంబర్ , ఫోన్ నెంబర్ లతోపాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కూడా UAN నెంబర్ కు లింక్ చేయటం తప్పనిసరి.
3).ఇక అంతే కాదు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని కూడా ఈ UAN నెంబర్ కు లింక్ చేయటం తప్పనిసరి.
4). అప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది.

Pf మనీ మిత్రుడా చేయండి ఇలా.
1). ముందుగా మీ EPFO అకౌంట్ లాగిన్ చేయండి. అక్కడ మీరు  UAN నెంబర్, PASSWORD టైప్ చేయండి.
2). ఆన్లైన్ సర్వీస్ CLAIM -FORM -31,19& 10C) అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.

3). ఆ తరువాత AADHAR, PAN, bank వివరాలు చూపిస్తాయి.

4). అక్కడ ఖాతా చివరి 4 సంఖ్యలను  ఎంటర్ చేసి, వెరిఫై మీద  క్లిక్ చేయాలి. ఆ తర్వాత CLAIM బటన్ పై క్లిక్ చేయాలి.

5). ఇక  FORM-31 ను తీసుకొని, ఎందుకు మనము డబ్బులు డ్రా చేస్తున్నామో,అని  అక్కడ చూపించే ఆప్షన్లలో  సెలెక్ట్ చేసుకోవాలి.

6). Pf అకౌంట్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలను చెక్ చేసుకుని ఓకే చేయాలి.

అంతా కంప్లీట్ అయిన తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది.

అలా వచ్చిన  OTP ని  సబ్మిట్ చేస్తే, మీ ఈపీఎఫ్  ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.

ముఖ్య గమనిక : ఇవన్నీ సక్సెస్ కావాలంటే ముందుగా మీ కంపెనీ  HR మేనేజర్ అప్రూవల్ చేయాలి. తద్వారానే మీ ఖాతాకు మనీ జమ చేయబడుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: