"ఏసీ" గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా ?

VAMSI
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసి లేనిదే ఇంట్లో ఉండడం చాలా కష్టం. మాములుగా గ్రామాల్లో అయితే ఏసి వాడకాలు చాలా తక్కువ ఎందుకంటే అక్కడ పర్యావరణం పూర్తిగా చెట్లతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. కానీ పట్టణాల్లో అయితే చెట్లు చాలా తక్కువగా ఉంటాయి, మరియు అపార్ట్మెంట్స్ లో జీవిస్తూ ఉండడం వలన చల్ల గాలి కాదు కదా, కనీసం గాలి సరిగ్గా ఆడని పరిస్థితులు మనము చూడవచ్చు. అందుకే ఇక్కడ ఏసీ లేకుండా జీవించడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీ జీవితంలో చల్లని గాలిని అందించే ఏసీ గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
* అందరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే, ఏసీ ని మొదట్లో మానవుని సౌకర్యం కోసం తయారు చేయబడలేదు. 1902 వ సంవత్సరంలో ఒక వార్తా సంస్థలో పని చేస్తున్న విల్లిస్ క్యారియర్ ఒక రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీటి ద్వారా పొగమంచుని తయారు చేయగలమని తెలుసుకున్నాడు. దాని ద్వారా గాలిలోని తేమను నియంత్రిస్తుందని కనుగొన్నాడు. ఇదే నియమం ఆధారంగా ఈ రోజు ఏసీ లు పనిచేస్తున్నాయి.
* 1990 సంవత్సర కాలంలో ఏసీలు బాగా ఆదరణ పొందుతున్న రోజుల్లో, సినిమా థియేటర్స్ యాజమాన్యాలు ఏసీ లను థియేటర్లో అమర్చడానికి వీటిలో పెట్టుబడులు పెట్టారు. ఆ రోజుల్లో ఎవ్వరికీ ఏసీ లు లేనందువలన, ప్రజలు థియేటర్ కి వెళితే  హాయిగా ఏసీలో ఉండవచ్చు అనే ఆలోచనతో ఎక్కువగా వెళ్లేవారు. ఇది థియేటర్ యజమానులకు బాగా ప్లస్ అయింది. వీరు లాభాలను కూడా బాగా గడించారు.
* ఏసీ లు వినియోగంలోకి రాక ముందు వరకు ప్రజలంతా చల్లని గాలిని పొందడానికి ఐస్ ముక్కలను పెద్ద పెద్ద బాక్స్ లలో పెట్టుకుని, వాటి నుండి వచ్చే చల్లని గాలి ద్వారా సంతోషపడేవారు. ఈ బాక్సులలో నింపబడిన ఐస్ ద్వారా వచ్చే చల్లదనాన్ని కొలతగా తీసుకుని ఏసీ లలో తగిన కూలింగ్ రావడానికి ఎంత పవర్ ను ఇవ్వాలి అనేది అంచనా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
* ఏసీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చి వుంటారు. ఏసీలు అందుబాటులోకి రక ముందు వరకు బాగా వేడిగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఏమిటి ? ఈ విషయం ఊహించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ ఏసీ లు వచ్చాక ఇలాంటి వేడి ప్రాంతాల్లో నివసించే జనాభా శాతం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు: ఫ్లోరిడా, టెక్సాస్ మరియు ఇతర వేడి ప్రాంతాలు.
* మొట్టమొదటిగా ఈ ఏసీని కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా ? అతనిపేరు హెర్బర్ట్ హూవర్. వాషింగ్టన్ డీసీ లాంటి వేడి ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఏసీ లేకుండా జీవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది. కానీ అందరిలాగా హూవర్ ఇబ్బంది పడలేదు. అప్పట్లో 1929 లో స్టాక్ మార్కెట్ కుదేలైన పిదప, ఏసీని పొందడానికి 30,000 వేల డాలర్లు ఖర్చు చేశాడు.
* మాములుగా వైద్య రంగంలోనూ దీని పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం వాడుతున్న వైద్య పరికరాలు కానివ్వండి లేదా మెడిసిన్ కానివ్వండి. ఇవి అన్నీ కూడా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్దనే తయారు చేయబడతాయి మరియు వాడబడుతాయి. ఈ రోజు ఈ ఏసీ మనము కలిగి ఉండకపోతే ప్రపంచంలోని ప్రాణాంతకమైన ఎన్నో జబ్బులకు మెడిసిన్ కనుక్కొని ఉండలేము.

* పాఠశాలలు పిల్లలకు వేసవి కాలంలో సెలవులు ఇచ్చే వారు. ఈ వేసవి కాలంలో ఏసీలు లేకుండా ఇంటి దగ్గర ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఏసీలు వచ్చిన తరువాత వేసవి కాలం సెలవులలోనూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
* 1899 లో, కార్నెల్ విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా వెంటిలేషన్ సిస్టం ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉపయోగంతో అక్కడ స్టూడెంట్స్ ఎటువంటి చెడు వాసన లేకుండా డిసెక్షన్ చేయగలిగేవారు.
* ఏసీ ల వలన చాలా మందికి అలర్జిస్ వస్తాయని నిరూపితం అయింది. ఈ ఏసీ నుండి వచ్చే చల్లని గాలి వలన అలర్జీలు కలుగుతాయి. కాబట్టి కొంతమంది ఏసీలో ఉండడానికి ఇష్టపడరు. ఆరోగ్యం కన్నా సౌకర్యంగా ఉండడం గొప్ప విషయం కాదు కదా.
* అయితే ఒక విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అమెరికా దేశంలో ఏసీ లను ఎక్కువగా వాడుతారని తెలుస్తోంది. వీరు పూర్తిగా ఏసీ లకు దాసోహమయిపోయారు. ఏసీ ల కోసం ఒక సంవత్సరంలో వీళ్ళు ఖర్చు చేసే విద్యుత్ యూనిట్లు, ఆఫ్రికా ఖండం ఉపయోగించే పూర్తి విద్యుత్ యూనిట్ల కన్నా ఎక్కువట.

ఇలా మనము సంతోషం కోసం మరియు సౌకర్యంగా ఉండడం కోసం వాడే ఏసీ గురించి తెలియని కొన్ని విషయాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: