HBD జగన్: రాజకీయాలలో ఒకే ఒక్కడు.. ప్రతి అడుగు ఒక సంచలనమే..?

Divya
ఏపీ: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఒక సొంత పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేసిన ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రా చరిత్రలోనే ఎవరు సాధించలేనటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఏకంగా 151 యొక్క స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించారు. సీఎం కుమారుడిగా రాజకీయా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జగన్ తనకు ఎదురైన ఇబ్బందులను, సవాళ్లను ఎదుర్కొని మరి పట్టుదలతో సీఎం అయ్యారు. కాని 2024 ఎన్నికలలో చాలా దారుణంగా వైసిపి ఓడిపోయింది.


జగన్ అంటే జనం జగన్ అంటే ప్రభంజనం అన్న రీతిలో రాజకీయం జీవితం కొనసాగింది. తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువనేత తొలిసారి ఎంపీగా ఎన్నికై, తండ్రి మరణం తర్వాత ఏపీ రాజకీయాలలో ఒక కీలకమైన నేతగా ఎదిగారు. 2009 హెలికాప్టర్ ప్రమాదంలో  సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించారు. వైయస్సార్ మరణాన్ని చూసి తట్టుకోలేక పోయిన ప్రజలు ప్రాణాలు విడిచిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకే ఓదార్పు యాత్రను మొదలుపెట్టారు. ఈ విషయంలో అప్పటి కాంగ్రెస్ హై కమాండ్ జగన్ కు అడుగడుగునా కూడా  అడ్డు తగిలింది. దీంతో చివరికి అధిష్టానంను జగన్ విభేదించారు. అనంతరం తల్లి విజయమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఎంపీ పదవికి కూడా రిజైన్ చేశారు. జగన్ 2011లో ycp పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ , అటు టిడిపి నుంచి భారీగానే ఎమ్మెల్యేలు చేరారు. కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు.2012లో అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు చేశారు.అనంతరం 16 నెలలు జైలు జీవితం గడిపారు జగన్మోహన్ రెడ్డి.


Ycp పార్టీతో 2014 ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేశారు. అయితే ఏపీలో టిడిపి పార్టీ అధికారం వచ్చిన 67 స్థానాలలో వైసిపి ప్రభంజనం సృష్టించింది. తెలంగాణలో కేవలం 3 అసెంబ్లీ స్థానాలలో గెలిచింది.2014 నుంచి 2019 మధ్య అలుపెరుగని పోరాటం చేసిన జగన్, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర(3000km) చేశారు. నవరత్నాల పేరుతో ఎన్నో పథకాలను అమలు చేస్తానని చెప్పి 2019లో 151 యొక్క స్థానాలలో భారీ విజయాన్ని అందుకున్నారు. 22 మంది ఎంపీలను గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు.


ఇక అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని పథకాలను అమలు చేశారు. కానీ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని వ్యతిరేకత, అలాగే ( జనసేన టిడిపి బిజెపి) పార్టీలు కూటమిగా 2024 ఎన్నికలలో బరిలో దిగడంతో వైసిపి పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. అయినా కూడా 40% ఓటింగ్ తో వైసీపీ ఉంది. దీంతో చాలామంది వైసిపి నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. అయినా సరే ధైర్యంతో అన్నిటిని ఎదుర్కొని ప్రజల బాట పడుతున్నారు మాజీ సీఎం జగన్. తనకు నాయకులతో పనిలేదని కేవలం ప్రజల అండదండలు ఉంటే మరోసారి వైసీపీ కచ్చితంగా అధికారం చేపడుతుందని అభిప్రాయపడుతున్నారు.2029 ఎన్నికలలో  ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: