గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే... రోజు గుప్పెడు శెనగల ఆహారంలో చేర్చుకోండి...
శనగల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి రకరకాలుగా ఉంటాయి నల్ల శనగలు, కాబూలీ శనగలు అని ఉంటాయి. శనగలలో సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దగ్గరికి రా నీవు. సెనగలు ఉడకబెట్టుకొని తినవచ్చు, లేదా మొలకలు చేసుకొని అయినా తినవచ్చు. ఎలా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. శనగలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
శనగ లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా శనగల్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ మరియు ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్ అధికంగా ఉంటాయి. ఇన్సులిన్ ఈ ప్రక్రియను మెరుగుపరచడంలో ను బాగా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు రోజు గుప్పెడు సెనగలు తీసుకోవడం చాలా మంచిది.
మాంసాహారంలో కంటే పది రెట్లు ప్రోటీన్ శనగ లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసం తినని వాళ్ళు శనగలను తిని శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందించవచ్చు. అంతేకాకుండా శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. పాలలో ఉండే క్యాల్షియం కి సమానంగా శనగల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆహారంలో భాగంగా శనగలను చేర్చుకోవడం చాలా మంచిది.
చిన్న పిల్లలకు ఏదో ఒక రూపంలో రోజు సెనగలు పెట్టడం వల్ల పిల్లల ఎముకలు దృడంగా మారుతాయి. సెనగలు తినడం వల్ల బిపి కూడా కంట్రోల్ అవుతుంది. రక్తహీనతతో ఉన్నవాళ్ళు సెనగలు తినడం వల్ల రక్తం బాగా పడుతుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెంచుతుంది. రక్తము సక్రమంగా సరఫరా కావడానికి సెనగలు బాగా దోహదపడతాయి.
చిన్న పిల్లలకు స్నాక్స్ గా శెనగలు పెట్టడం వల్ల ఒత్తిడి ఆందోళన దూరమవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు శనగలు తినడంవల్ల నిద్ర బాగా పడుతుంది. శనగల్లో మినరల్స్, ప్రోటీన్స్, ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సెనగలు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందడమే కాకుండా, ఈ రోజంతా శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. అందుకే రోజు గుప్పెడు శనగలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
శనగల్లో పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఉప్పుని బయటకు పంపుతుంది. దీనివల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పచ్చకామర్లు, లివర్ వ్యాధులు ఉన్నవాళ్లు సెనగలు తినడం వల్ల ఆ వ్యాధులు నుండి సులువుగా బయటపడతారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజూ శెనగలను తీసుకోవడం మంచిది.