రెడ్ మీ ఫోన్లకు భారీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. ఇటీవలే కొత్త ఫోన్ ను లాంఛ్ చేసిన కంపెనీ ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేశారు.. ప్రస్తుతం ఆ ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ భారీగా పెరిగింది.మీరు విన్నది నిజమే.. మార్కెట్ లో హవాను కొనసాగిస్తున్న ఫోన్లలో ఈ ఫోన్ లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల అభిరుచులకు తగ్గట్లు మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేశారు రెడ్ మీ కంపెనీ.. ఆవ ఫోన్వివరాల విషయానికి వస్తె..
రెడ్ మీ నోట్ 9 5జీ, రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు టెనా వెబ్ సైట్లో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఈ వెబ్ సైట్లో కనిపించాయి. రెడ్ మీ నోట్ 9 సిరీస్‌లో కొత్త ఫోన్లు లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. స్టోరేజ్ 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
మరో ముఖ్యమైన విషయమేంటంటే.. వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. వీటిలో 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది.. దీని బరువు వచ్చి సుమారు 200 గ్రాములు ఉంటుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ అయి ఉంటుందని కంపెనీ పెళ్ళదించింది. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4720 ఎంఏహెచ్‌గా ఉంటుంది.. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర మాత్రం వెల్లడించలేదు.. మొత్తానికి పెద్ద బ్రాండులతో పోటీ పడుతున్న ఈ ఫోన్ కు అప్పుడే డిమాండ్ కూడా భారీగా పెరిగింది..