బుల్లిపిట్ట: హానర్ 10ఎక్స్ లైట్ ధర, ఫీచర్స్ వివరాలు ఇవే...!
ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యూజిక్ యూఐ 3.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. అయితే ఇందులో గూగుల్ సర్వీసులు ముందుగా ఇన్ స్టాల్ అయి రావు. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.... 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. దీని ధరను 799 సౌదీ రియాళ్లుగా (సుమారు రూ.15,900) నిర్ణయించారు.
కలర్స్ విషయానికి వస్తే...... ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, మిడ్ నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి.... 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్ 5.1, జీపీఎస్/గ్లోనాస్/బైదు, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు అందించారు.