వన్ ప్లస్ ఫోన్ 20 వేల లోపు వస్తుందా? ఎప్పుడంటే?

Satvika
ఐ ఫోన్ తర్వాత అలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ఫోన్ స్మార్ట్ లుక్ తో పాటుగా, ఐ ఫోన్ ను మించిన ఫీచర్లతో ఉంటుంది..అందుకే యువతకు ఐ ఫోన్ మీద మోజు తగ్గి , వన్ ప్లస్ పై మక్కువ పెరిగింది. ఈ ఫోన్ స్టయిల్ లుక్ ఉంటుంది. దీంతో మార్కెట్ లో ఈ ఫోన్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే వన్ ప్లస్ కంపెనీ అందరికీ అందుబాటులో ధరలతో ఉంటుంది. మరిన్ని ఫీచర్లతో పాటుగా, ధర తక్కువ లో వస్తుంది. కంపెనీ సేల్స్ ను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఫోన్ ను లాంఛ్ చేయనున్నారు.

వన్ ప్లస్ నార్డ్ ఎన్ 100 కొత్త ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది.ఈ కొత్త  వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు సోమవారం లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ ధర విషయానికొస్తే.. 17,400 రూపాయలు ఉంది.

ఈ ఫోన్ యూరప్ తో పాటుగా అమెరికాలో కూడా ఇదే రోజు మార్కెట్ లోకి రానుంది.. 6.52 అంగుళాల హెచ్‌డీ మరియు డిస్ ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టీరియో స్పీకర్లను ఇందులో అందించనున్నట్లు సమాచారం.జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాససర్ ను కలిగి ఉంటుంది.వన్ ప్లస్ 2018 నుంచి తన ఫోన్లలో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను అందించడం లేదు. దాంతో పాటుగా ఈ ఫోన్ లో జాక్ ఉండవచ్చునని భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: