కొనసాగుతున్న అఖండ 2 లొల్లి..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందడం , ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబోలో రూపొందిన , సింహ , లెజెండ్ , అఖండ మూవీలు అద్భుతమైన విజయాలను సాధించి ఉండడంతో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే అనేక ప్రాంతాలలో ఈ మూవీ ప్రీమియర్ షో లకు మరియు ఆ తర్వాత చాలా రోజులకు సంబంధించిన టికెట్ బుకింగ్లను కూడా ఓపెన్ చేశారు. చాలా మంది ప్రేక్షకులు ఈ మూవీ కి సంబంధించిన టికెట్లను బుకింగ్ చేసుకున్నారు. ఇక అంతా సజావుగా ఉంది , సినిమా విడుదల అవుతుంది. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అని బాలయ్య అభిమానులు అనుకునే లోపే ఈ సినిమా విడుదల వాయిదా పడింది అనే వార్త బయటకు వచ్చింది.


ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడింది ... కొత్త విడుదల తేదీ ఇంకా ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. దానితో బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా విడుదల వాయిదా పడడం ఏంటి ..? బాలయ్య టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఆయన బావగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇంత క్రేజ్ , సర్కిల్ ఉన్న హీరో సినిమా వాయిదా పడడం ఏంటి అని అనేక మంది పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. మరి అఖండ 2 సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: