టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన అఖండ 2 అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఈ సినిమాను కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని హిందీ భాషలో విడుదల చేయనున్న ఉద్దేశం తో ఈ మూవీ బృందం వారు హిందీ లో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలను చేశారు.
ఇకపోతే ఈ సినిమా కోసం స్వయంగా బాలకృష్ణ హిందీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ కూడా తమ కెరియర్లో హిందీ లో సినిమాలలో నటించారు. కానీ ఇప్పటి వరకు ఈ ముగ్గురు హీరోలు ఎవరూ కూడా తమ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెప్పలేదు. బాలకృష్ణ మొట్ట మొదటి సారి అఖండ 2 మూవీ ద్వారా హిందీ లో డబ్బింగ్ చెప్పుకొని రికార్డు కొట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.