టెక్నాల‌జీ: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే ఫోటోలు అదిరిపోవాల్సిందే..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా కొందరు సందర్భానుసరంగా ఫోటోలు దిగితే.. మరికొందరు మాత్రం ఫోటోలు దిగడం మాత్రమే పనిగా పెట్టుకుంటారు. ఉదయం లేచినదగ్గర నుంచి రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు దిగుతూ మురిసిపోతుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని.. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే ఫోటోలు దిగ‌డం ఎంత ముఖ్య‌మో.. అది అందంగా ఉండ‌డం కూడా అంతే ముఖ్యం.

 

అలా కావాలంటే..  ఫోన్‌లో మంచి కెమెరాతో పాటు మంచి కెమెరా యాప్ కూడా ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే యాప్‌ మాత్రమే కాదు... యాప్ స్టోర్‌లో కెమెరా యాప్స్ చాలా ఉంటాయి. అలాంటిదే అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్. అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్‌లో బ్లూ స్కైస్, రివరీ ఫిల్టర్స్ లాంటి క్రియేటీవ్ లెన్సెస్ ఉంటాయి. యూజర్లు ఈ ఫిల్టర్లు, లెన్సులను తమకు తగ్గట్టుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇంకొన్ని ఫిల్టర్లతో బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేయొచ్చు. పాప్ ఆర్ట్, స్పెక్ట్రమ్, ఫుడ్, కలర్ ఈకో లాంటి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వొచ్చు. 

 

ఇందులో మ‌రో అద్భుత ఫీచర్ ఏంటంటే మీరు మీ ఫోటోను ఎడిట్ చేయడానికి, ఫినిషింగ్ టచెస్ ఇవ్వడానికి ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ అక్క‌ర్లేదు. ఫోన్‌లోనే మీకు కావాల్సినట్టుగా ఫోటోను ఎడిట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోను ఎడిట్ చేయొచ్చు. ఎన్నో అద్భుత ఫీచ‌ర్లు ఉన్న ఈ కెమెరా మీ ఫోన్‌లో ఉంటే.. ఫోటోలు అదిరిపోవాల్సిందే. కాగా,  అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్ 2019 నవంబర్‌లో వ‌చ్చింది. అయితే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఉచితంగా ఈ యాప్ యూజ్ చేసుకోవ‌చ్చు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. మీరు కూడా ఈ యాప్‌ను ట్రై చేసి చూడండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: