
30 సెకన్లలో కరోనా నిర్దారణ... హైదరాబాద్ పరిశోధకుల కొత్త టెక్నాలజీ..?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కి సంబంధించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనల్లో కొన్ని కరోనా వైరస్కు మందు కనుగొనడానికి జరుగుతుంటే.... మరికొన్ని పరిశోధనలు కరోనా వైరస్ యొక్క మూలాలను కనుక్కోవడానికి జరుగుతున్నాయి. అంతేకాకుండా రోజురోజుకు కరోనా వేషధారణలో కూడా వేగం పెంచే విధంగా సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. మొదట్లో రెండు మూడు రోజులు పట్టేది కానీ ప్రస్తుతం ఆరు గంటల్లోనే నిర్ధారణ చేస్తున్నారు. రాపిడ్ టెస్ట్ కిట్లు తదితరాల ద్వారా ఒక మనిషిలోని రోగనిరోధక శక్తిని కూడా పరీక్షించే టెక్నాలజీ వచ్చేసింది.
ఇక తాజాగా సరికొత్త టెక్నాలజీని తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టిన తెలుస్తోంది. లాలాజలం ఆధారంగా 30 సెకన్లలోనే కరోనా వైరస్ను నిర్ధారణ చేసేలా హైదరాబాద్లోని జాతీయ పశు జీవసాంకేతిక విజ్ఞాన సంస్థ కొత్త పరికరాన్ని కనుగొన్నది. ఇక ప్రస్తుతం కనుగొన కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే... కరోనా వైరస్ రాకుండా ఆపడానికి కరోనా టెస్టులు చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో కనుగొన్న కొత్త టెక్నాలజీని ఐసీఎంఆర్ వారు అప్రూవల్ చేయాల్సి ఉంది.
ఈ కొత్త టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే... వేగంగా కరోనా వైరస్ నిర్ధారణ చేయవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో బస్టాండ్లలో ఇలాంటి పరీక్షలు చేయడం ద్వారా ఎలాంటి వైరస్ బారిన పడనివారు బస్సుల్లో రైళ్లల్లో ఎక్కించడానికి వీలు ఉంటుంది. అప్పుడు దేశ వ్యాప్తంగా ట్రాన్స్పోర్టేషన్ మొదలవ్వడానికి కూడా వీలు ఉంటుంది. మొన్నటి వరకు ధర్మల్ స్క్రీనింగ్ లు ఎలా చేశారో... ఇప్పుడు డైరెక్ట్ గా టెస్ట్ ద్వారా కరోనా వైరస్ నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అటు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కిట్లు తదితర శాఖలకు సంబంధించిన ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ టెక్నాలజీ తొందరగా అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.