రష్మిక నే కాదు ఫిబ్రవరీ లో ఆ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతుంది..ఫ్యాన్స్ కి డబుల్ గుడ్ న్యూస్..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ రష్మిక మందన్న ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఇండస్ట్రీలోని ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్త దాదాపు నిజమేనని, “ఆల్మోస్ట్ కన్ఫర్మ్” అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించిన తీరుతో పాటు, సోషల్ మీడియాలో కనిపించిన కొన్ని క్లూస్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా ఇటీవల దసరా పండుగ సందర్భంగా ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారనే వార్త బయటకు రావడంతో వీరి రిలేషన్‌పై మరింత చర్చ మొదలైంది.తాజా సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 26వ తేదీన వీరి వివాహం అత్యంత వైభవంగా జరగబోతుందట. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ వార్తల్లో మరో హైలైట్ ఏంటంటే… అదే ఫిబ్రవరిలో, అదే ముహూర్తానికి మరో స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్‌తో తమన్నా డేటింగ్ చేస్తుందన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేశాయి. అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందన్న ప్రచారం కూడా వినిపించింది. ఈ విషయంపై తమన్నా పూర్తిగా మౌనంగా ఉండడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఇప్పుడు తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న కథనాల ప్రకారం, తమన్నా ఒక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడితో డేటింగ్ చేస్తుందట. అంతేకాదు, వీరి వివాహం కూడా ఫిబ్రవరిలోనే జరగబోతుందన్న వార్త బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త బాలీవుడ్ మీడియాలోనే కాకుండా, తెలుగులో కూడా పెద్ద చర్చకు దారితీసింది.
తెలుగు ప్రేక్షకుల్లో తమన్నాకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా, ఆమె పెళ్లి వార్తపై అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నిజంగానే తమన్నా పెళ్లి చేసుకోబోతుందా? లేక ఇది కేవలం బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లేనా? అనే విషయం తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.ఇక మొత్తంగా చెప్పాలంటే, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఒకవైపు, అదే సమయంలో తమన్నా పెళ్లి టాక్ మరోవైపు… ఫిబ్రవరి నెల మొత్తం సినిమా ఇండస్ట్రీలో పెళ్లి సందడితో హాట్ టాపిక్‌గా మారబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. నిజానిజాలు త్వరలోనే బయటపడతాయేమో చూడాలి.