టెక్నాల‌జీ: గూగుల్‌తో జ‌ర జాగ్ర‌త్త‌.. మీ గుట్టంతా అందులోనే..

Kavya Nekkanti

ప్ర‌స్తుత కాలంలో ఏం అవసరం వచ్చినా వెంటనే మన వేళ్లు గూగుల్‌లో వెతుకుతుంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు గూగుల్ కూడా ఒక భాగమైపోయింది. ఇలా ఇప్పుడంతా గూగుల్ త‌ల్లి మ‌యం అయిపోయింద‌ని చెప్పాలి.  గుంపు ఎక్కువగా ఉన్న చోటనే దొంగలు కూడా ఉంటారన్నట్లు.. గూగుల్‌తో ఎంత సౌక‌ర్యం ఉందో అంత న‌ష్టం ఉంది. ఎందుకంటే.. మీరు ఎక్కడ ఉన్నారో గూగుల్ కు తెలుసు.. మీరు ఫోన్లో ఏం చేస్తున్నారో కూడా గూగుల్ కు తెలుసు. మీ ప్రతి మూమెంట్ పై గూగుల్ కంట కనిపెడుతోంది జాగ్రత్త. ఎలాగంటే.. గూగుల్ మ్యాప్స్ ఉండనే ఉంది కదా. ఇదే మిమ్మల్ని గూగుల్ పసిగట్టేలా చేస్తోంది. 

 

ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడా ఉన్నామో మ్యాప్స్ సాయంతో ఈజీగా లొకేషన్ కనిపెట్టవచ్చు.  మీరు వాడే డివైజ్ కావొచ్చు.. మరి ఏదైనా కావొచ్చు.. సరైన పద్ధతిలో గూగుల్ మ్యాప్స్ సెట్ చేయలేదా? మీరెక్కడన్నారో గూగుల్ పసిగట్టేస్తుంది. నడిచినా లేదా డ్రైవింగ్ చేసినా గాల్లో ఎగిరినా సరే.. మీ ప్రతి మూమెంట్ గూగుల్ సర్వర్లలో స్టోర్ అవుతుంది జాగ్రత్త. అదెలా అంటే..  ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కామన్ అయిపోయింది. ఆన్ లైన్ లో ఏదైనా యాక్సస్ చేసుకోవాలంటే లొకేషన్ పర్మిషన్ ఇస్తుంటారు. మీ ఫోన్లలో కూడా లొకేషన్ ఎనేబుల్ చేసి ఉంటే.. గూగుల్ అకౌంట్ ఆధారంగా మీ లొకేషన్ డేటా ఎప్పటికప్పుడూ స్టోర్ అవుతుంది.

 

అయితే గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ లొకేషన్ డేటా స్టోర్ అయిన తేదీ నుంచి ప్రతి 18 నెలలు లేదా ప్రతి 3 నెలలకు ఆటోమాటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీని కోసం.. మీరు వాడే ఆండ్రాయిడ్/ఐఫోన్ లో గూగుల్ మ్యాప్స్‌ యాప్ ఓపెన్ చేసి.. టాప్ లెఫ్ట్ లో మెనూ బార్ పై ట్యాప్‌ చేయండి. త‌ర్వాత  యువ‌ర్ టైమ్‌లైన్‌పై ఎంచుకోండి. టాప్ రైట్ స్క్రీన్‌లో మూడు డాట్స్‌పై ట్యాప్ చేయండి. సెట్టింగ్స్‌, ప్రైవ‌సి ఆప్షన్లను ఎంచుకోండి.  ఆటోమాటిక‌ల్లీ డిలీట్ లోకేషన్ హిస్టరీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కీప్ అన్‌టిల్‌ ఐ డిలీట్ మ్యానువ‌ల్లీ అనే సెట్టింగ్ మార్చుకోండి. కీప్ ఫ‌ర్ 18 మంత్స్ లేదా కీప్ ఫ‌ర్ 3 మంత్స్‌ సెట్ చేసుకుంటే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: