జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. త్వరలో మనదేశంలో హైస్పీడ్ 5జీని ఆనందించవచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు మరి ఇంకా కొంతసమయం వేచిఉండక తప్పదు.సెల్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్ల వైపు పరుగులు తీస్తుంటే త్వరలో 5జీని ఎంజాయ్ చేయవచ్చు అనుకునే వాళ్లలో మీరు కూడా ఉన్నారా?. అయితే మీలాంటి వారికి మరింత బాధాకరమైన వార్త. మనదేశంలో 5జీ అందుబాటులోకి వచ్చేసరికి మరో 5
—6 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు. అదేంటి... త్వరలో 5జీ వచ్చేస్తోందని ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి కదా.. అనుకుంటున్నారా? ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే చేసింది.
దీనికి సంబంధించిన కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదంటే మీరు నమ్ముతారా? అవును! ఇంకా మనదేశం 5జీ స్పెక్ట్రంకి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో ప్రయోగాలు కూడా మొదలు కాలేదు. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే మనదేశంలో 5జీకి సంబంధించిన స్పెక్ట్రం వేలాల ప్రారంభం అవుతాయని, మరో 100 రోజుల్లో 5జీ సేవలకు సంబంధించిన ట్రయల్స్ కూడా ప్రారంభం అవుతాయని టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.
కానీ 5జీకి సంబంధించిన ఆచరణ అంత వేగంగా జరిగేలా కనిపించడం లేదు. 5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలు, మౌలిక వనరులు, స్పెక్ట్రం వంటి కనీస వనరులు ఏవీ అందుబాటులో లేవు. కానీ భారతదేశ వినియోగదారులకు కొన్ని 5జీ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో 5జీ అందుబాటులోకి రావడానికి 2023 వరకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి 2025 వరకు సమయం పడుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ నీల్ షా ప్రకటించారు.అప్పటి వరుకు భారతదేశ వినియోగదారులు వెయిట్ చేసి ఉండడం తప్పదు.4g నెట్వర్క్ వినియోగించి అందించవల సిందిగా కోరుచున్నాము. అతి త్వరగా 5G నెట్ వర్క్ వస్తే వినియోగదారులు ఆనందిస్తారు.