
టివి: రెండో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ యాంకర్..!
చైత్రకు వివాహమైన ఐదేళ్ల తర్వాత 2023లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నదట.. అయితే అతడి నుంచి విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం తనతో పాటుగా తన కుటుంబాన్ని కూడా మోసం చేశాడని .. ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎన్నో సందర్భాలలో ఏడ్చారని గతంలో చైత్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. అయితే తన పెళ్లి విషయంతో కుటుంబ సభ్యులు కాస్త ఆనందపడతారని ఆలోచించారని అందుకే తాజాగా రెండో పెళ్లి గురించి ప్రకటన చేసి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది చైత్ర వాసుదేవన్.
అయితే తన ఇంస్టాగ్రామ్ లో ఒక పెద్ద స్టోరీ తో యాంకర్ చైత్ర 2025 లో తాను కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారనే విషయాన్ని తెలియజేసింది.. ఇది నా వివాహ జీవితంలో ఒక బ్యూటిఫుల్ జర్నీ అంటూ తెలియజేసిన ఈ అమ్మడు ఈ విషయం విన్న అభిమానులు సైతం తెగ లైక్స్ కామెంట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ న్యూ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రెండో పెళ్లి విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకొని మరి తన జీవితాన్ని మొదలు పెడుతున్నానంటూ తెలియజేస్తోంది యాంకర్ చైత్ర వాసుదేవన్.