టివి: బిగ్ బాస్ హౌస్ వదిలి పొమ్మంటూ కంటెస్టెంట్ కు వార్నింగ్.. ఏమైందంటే..?
అలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో మొదటి రోజు కంటెస్టెంట్స్ తో ఎక్కువగా గొడవలు చేసింది.. దీంతో ఆమె ఇంకా మారలేదని కన్నడ బిగ్ బాస్ ప్రోమోన్ చూసిన ఆడియన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేశారు.. తెలుగులో ఎంత నెగిటివిటీ కంటెంట్ ఇచ్చినప్పటికీ టాస్కుల దగ్గర వచ్చేసరికి ఆమె అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది.. ముఖ్యంగా మగవాళ్లకు సమానంగా సైతం ఆమె ఎలాంటి విషయాలలోనైన పోటీపడేది. కన్నడ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈమె అలాగే ఉంటుందనుకున్నప్పటికీ అంచనాలను అందుకోలేకపోయినట్లు సమాచారం.
బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రెండు వారాలు పూర్తి అయ్యిందో లేదో.. హోస్ట్ కిచ్చా సుదీప్ కి కోపం తెప్పించేలా చేసింది. కంటిస్టెన్స్ ని అందరిని సుదీప్ మీలో ఎవరు హౌస్ లో ఉండేందుకు అర్హులు కాదని అడగగా అందరూ శోభా శెట్టి పేరు చెప్పారు.. కారణం కూడా తెలియజేస్తూ ఈమె అడుగు పెట్టినప్పుడు పటాకా లాంటి అమ్మాయి అనుకున్నాము.. టాస్కులతో ఆడి మాకి పోటీ ఇస్తుందనుకున్నాము కానీ మా అంచనాలను అసలు అందుకోలేదనీ తెలిపారు.. సుదీప్ మాట్లాడుతూ ఇంతమంది నువ్వు హౌస్ లో ఉండవద్దని కోరుకుంటున్నారు ఎందుకు అలా? అని అడగగా.. నేను కూడా నీ నుంచి చాలా ఆశించాను కానీ అసలు గేమ్ ఆడటం లేదంటూ తెలిపారు సుదీప్.దీంతో ఆమె మాట్లాడుతూ..తనకు ఇక్కడ వాతావరణం అసలు సెట్ కాలేదని తాను ఆడలేనేమో అనిపిస్తుందని చెప్పినప్పటికీ సుదీప్ ఆమెకు ధైర్యం చెప్పారు.. త్వరలోనే తన విశ్వరూపం చూపిస్తానంటూ.. చెప్పిన శోభా శెట్టికి.. సుదీప్ కూడా ధైర్యం చెప్పినప్పటికీ..చివరికి తనకు ఆరోగ్యం బాగాలేదని హౌస్ లో నుంచి బయటికి వెళ్లిపోతానంటే శోభాశెట్టి వేడుకుంటున్నట్లు ఎపిసోడ్లో చూపించారు.దీంతో సుదీప్ కూడా ఫైర్ అయ్యారు.