ఏపీ: హైప్ పెరుగుతున్న జనసేన.. మరి టిడిపి..?
ఇటీవల పవన్ కళ్యాణ్ తన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి.. సముద్రంలోకి వెళ్లి షిప్లో అక్రమంగా వెళుతున్న బియ్యాన్ని సైతం పట్టుకోవడంతో ఒక్కసారిగా జనసేన క్రేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ రేంజ్ కూడా పెరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం పైన మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ తెలియజేశారు.. పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం మంచిదే కానీ పర్యటన పైన కూడా అంత అనుమానం గానే ఉందని తెలియజేశారు. అలాగే పోర్టు ఆఫీసర్, కష్టం ఆఫీసర్ కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్నప్పటికీ వారిద్దరూ పవన్ కళ్యాణ్ కు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటూ ప్రశ్నించారు.
దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ను షిప్పులోకి ఎక్కించవద్దంటూ చంద్రబాబు చెప్పి ఉండాలి అంటూ తెలిపారు.. అలాగే స్టెల్లా షిప్ అనేది ఎందుకు సీజ్ చేస్తామంటూ ప్రశ్నించారు.. అలాగే మరొక షిప్ కేన్ స్టార్ షిప్ ఉంది వాటి దగ్గరకు ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు.. అలాగే కెన్ స్టార్ షిఫ్లు ఏకంగా 42 వేల టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే విధంగా తెలిపారు.. అయితే దాని వెనుక ఉన్నది వేల్పూర్తి శ్రీను అని మంత్రి పయ్యావుల కేశవకు స్వయంగా వియ్యంకుడు అవడం వల్లే ఈ పోర్టుని చెక్ చేయలేదంటూ తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని..
మొత్తానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడితో జనసేన రేంజ్ అయితే కాస్త పెరుగుతోంది తప్ప టిడిపికి పెద్దగా క్రేజ్ రావడం లేదు.. టిడిపిలో చాలామంది నేతలు అందరూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారని దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారనే విధంగా పలువురు కార్యకర్తలు కూడా వాపోతున్నారు. రోజురోజుకి జనసేన గ్రాఫ్ పెరుగుతూ ఉంటే టిడిపి గ్రాఫ్ తగ్గుతోందని అనుమానాలు కూడా మొదలవుతున్నాయట.