ఈవీఎమ్స్కు గుడ్ బై.. బ్యాలెట్ రోజులు మళ్లీ రాబోతున్నాయ్..?
మన ఇండియాలో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈవీఎమ్‌లు హ్యాక్ చేయడం కుదురుతుందని, అందుకే జగన్ ఘన విజయం సాధించగలిగారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి 2014లో ప్రజలు ఓట్లు క్యాస్ట్ చేయడానికి ఇవే యంత్రాలు ఉపయోగించారు. అప్పుడు టీడీపీ నేతలు ఏం మాట్లాడలేదు, తర్వాత ఓడితే రచ్చ చేశారు. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైనప్పుడు వైసీపీలోని కొందరు నేతలు కూడా ఈవీఎంలలో ఏదో తేడా జరిగింది అని అలిగేషన్స్ చేశారు. ఇక ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ సైతం ఇలాంటి మాటలే మాట్లాడుతోంది.
హస్తం పార్టీ కశ్మీర్లో కూటమితో కలిసి విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కి మిత్రపక్షలైన తృణమూల్ కాంగ్రెస్, స్టాలిన్ గెలిచారు. ఈవీఎమ్‌ల ద్వారా జరిగిన పోలింగ్ ద్వారానే ఈ విజయాలు సాధించడం జరిగింది. అయితే హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ ఓడిపోవడంతో ఆ ఈవీఎంస్ లో ఫాల్ట్ ఉండి ఉండొచ్చని, అవి హ్యాక్ కి గురై ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము గెలిచింది కూడా అవే ఈవీఎంలతో అని వారు మరిచిపోతున్నారు. వాటిలో లేని ఫాల్ట్స్ వీటిలో మాత్రమే ఎందుకు ఉంటాయి? అని ప్రశ్నించే వారికి సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక నింద వేసి ప్రజల్లో అపనమ్మకం క్రియేట్ చేసి తమ అసమర్థతను కపిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అంతేకాదు ఓడిన ప్రతి పార్టీ కూడా ఈవీఎమ్సే తమ ఓటమికి కారణమని చెబుతూ మొత్తం పోలింగ్స్ను బ్యాలెట్ పేపర్ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మెషిన్ల గురించి ఇలాంటి ఆరోపణలు ఎక్కువైతే చివరికి బ్యాలెట్ రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.