టీవీ: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి.. ఏకంగా పాన్ ఇండియా సినిమా..!
మొత్తానికి బుల్లితెర పైన యాంకర్ గా ఫుల్ బిజీ అయిన శ్రీముఖి అప్పుడప్పుడు వెండితెర పైన మాత్రం కనిపిస్తూ ఉంటుంది. పలు చిత్రాలలో హీరోలకు చెల్లెలిగా అక్క పాత్రలలో నటిస్తూ ఉంటుంది. గడిచిన కొంతకాలం సినిమాలలో కనిపించని శ్రీముఖి.. అధిక బరువు ఉండడం చేత అవకాశాలు రాలేదని సన్నబడినప్పటికీ అవకాశాలు రావడం లేదు.. తాజాగా శ్రీముఖి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది.
దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు కానీ ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయితే మాత్రం ఇందులో శ్రీముఖి మళ్ళీ అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం.. జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలుగా నటించిన శ్రీముఖి ఇప్పుడు మరొకసారి అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఖుషి చేస్తూ ఉంటుంది శ్రీముఖి. చివరిగా భోళా శంకర్ సినిమాలో నటించిన ఈమె దారుణంగా ట్రోల్ కి గురైంది.