మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి పూజ హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో ఈమెకు అవకాశాలు రావడం మొదలు అయింది. ఈమె నటించిన చాలా సినిమాల్లో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం , అలాగే ఈమె నటించిన మూవీల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో తక్కువ కాలం లోనే పూజ హెగ్డే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమెకు సరైన విజయాలు దక్కడం లేదు. దానితో పోయిన సంవత్సరం ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈమె నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ హీరో గా నటించిన ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది.
ఈ సినిమాతో పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమా కూడా విడుదల అయింది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు , అలా వైకుంఠపురంలో రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సరిలేరు నీకెవ్వరు కంటే కూడా అలా వైకుంఠపురంలో సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నారుగా నిలిచింది. ఈ మూవీతో పూజ హెగ్డే కూడా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ అయింది.