విశ్వంభర టీమ్ పై.. మెగాస్టార్ ఫైర్.. అసలేం జరిగిందంటే..?

Divya
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా గ్రాఫిక్స్ వల్ల కొంతమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. ఎందుకంటే గతంలో చిరంజీవి నటించిన అంజి సినిమాలోని పోలికలు ఇందులో క్లియర్ గా కనిపిస్తున్నాయట. చాలాకాలం తర్వాత మళ్లీ చిరంజీవి నేటితరం ఆడియన్స్ కి తగ్గట్టుగా విశ్వంభర సినిమాని చేస్తూ ఉన్నారు. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం పైన అంచనాలు కూడా తగ్గిపోతున్నాయట.

సోషల్ మీడియాలో కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు  నెగిటివ్ రెస్పాన్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండడం జరుగుతోందట. జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా తన కుమారుడు నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల అవుతూ ఉండడంతో పోస్ట్ ఫోన్ చేసుకున్నారు చిరంజీవి. మరింత ఎక్కువ సమయం దొరకడంతో డైరెక్టర్ వశిష్ట కూడా గ్రాఫిక్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చిరంజీవి కూడా కోరడం జరిగిందట. ఇటీవల కొన్ని షాట్స్ కూడా మెగాస్టార్ చిరంజీవికి చూపించగా వీటిపైన చిరంజీవి కూడా అసహనాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ వశిష్టపైన తీవ్రంగా ఫైర్ అయ్యారట.

సమయం మొత్తం కేవలం వృధా చేస్తున్నారు వెంటనే గ్రాఫిక్స్ టీమ్ ని మార్చేయాలంటూ కోరారట. నిర్మాత అశ్వని దత్ సహాయంతో కల్కి చిత్రానికి ఎటువంటి గ్రాఫిక్స్ ఉపయోగించారు అదే పని చేయాలని కోరినట్లు సమాచారం. కల్కి సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడం జరిగింది. విశ్వంభర సినిమాకి సంబంధించి మొత్తం గ్రాఫిక్స్ షాట్స్ అన్నీ కూడా ఆ టీమ్ కి పంపించినట్లు సమాచారం. విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి అయిన కొన్ని కీలకమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయట. ఈ నెలలో పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నదట టీమ్. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్, సురభి తదితర నటీనటులు కీలకమైన పాత్రల నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: