సంక్రాంతి సినిమాలతో సిమ్రాన్ కు భారీ విజయాలు.. ఆ సినిమాలతో సత్తా చాటిందిగా!

Reddy P Rajasekhar
హిందువులకు అతి ముఖ్యమైన పండగలలో సంక్రాంతి పండగ ఒకటి కాగా ఈ పండగ సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాలలో చాలా సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సిమ్రాన్ నటించిన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో సిమ్రాన్ సత్తా చాటారు.
 
సమరసింహారెడ్డి మూవీ 1999 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కాగా నరసింహ నాయుడు మూవీ 2001 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైంది. ఈ రెండు సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం సత్తా చాటి అదుర్స్ అనిపించుకున్నాయి. బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో ఈ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల విజయాలు సిమ్రాన్ కు ఎంతో ఆనందాన్ని కలిగించాయి.
 
బాలయ్య, సిమ్రాన్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తర్వాత రోజుల్లో సైతం కొన్ని సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడంలో ఫెయిలయ్యాయి. నటి సిమ్రాన్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో అయితే నటించడం లేదు. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం అంతాఇంతా కాదనే చెప్పాలి. సిమ్రాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.
 
అప్పటి స్టార్ హీరోలందరికీ జోడీగా సిమ్రాన్ నటించడంతో పాటు తన నటనతో మెప్పు పొందారు. హీరోయిన్ సిమ్రాన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. తెలుగులో దాదాపుగా అందరు సీనియర్ హీరోలకు జోడీగా సిమ్రాన్ నటించారు. సిమ్రాన్ ను ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఎంతగానో అభిమానిస్తున్నారు. అత్త, అమ్మ తరహా పాత్రలతో సిమ్రాన్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ లెవెల్ సినిమాలను ఎంచుకుంటున్న సిమ్రాన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించి సిమ్రాన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: