నందమూరి బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే అలాంటి నందమూరి బాలయ్య ఇప్పుడు సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నందమూరి బాలయ్య తాజాగా... డాకు మహారాజు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి.. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలో.. నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమాకు చంద్రబాబు నాయుడు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు.. వెసులుబాటు కల్పించింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. సినిమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం.
ఇందులో భాగంగానే నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమాకు కూడా... బంపర్ ఆఫర్ ప్రకటించింది. నాకు మహారాజు స్పెషల్ షో అలాగే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో... నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు ఈ నెల 12వ తేదీన... ఉదయం నాలుగు గంటలకు బెనిఫిట్ షో పడనుంది.
ఇక టికెట్ల ధరల విషయానికి వస్తే.. నందమూరి బాలయ్య నటించిన డాకుమహారాజు సినిమా టికెట్ 500 రూపాయలకు పెంచుకోవచ్చని... చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రకటన చేసింది. అలాగే మల్టీప్లెక్స్ లలో 135 రూపాయలు పెంచుకోవాలని... సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయలు... పెంచుకోవాలని సూచనలు చేసింది. అలాగే రోజుకు 5 ఆటలు ఆడేలా అనుమతులు కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. అటు గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు కూడా... ఇది అవకాశాన్ని కల్పించింది కూటమి సర్కారు.