టీవీ: బుల్లితెర పైన బిగ్ బాస్ ఓటిటి -2 కు ఎదురుదెబ్బ..!!

Divya
ఇటీవలే బిగ్ బాస్ సీజన్-7 మంచి సక్సెస్ ని అందుకుంది. ఈసారి నాన్ స్టాప్ గా ఓటీటి సెకండ్ సీజన్ కూడా మొదలు పెట్టాలని బిగ్ బాస్ సంస్థ పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బిగ్బాస్ ఓటింగ్ ఫస్ట్ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలోనే బిగ్ బాస్ అంటే కేవలం టీవీలోనే చూడాలని ఆడియన్స్ ఆలోచించేవారు.. అయితే ఆ తర్వాత బిగ్బాస్ సీజన్-7 ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ కూడా ఇవ్వడంతో చాలామంది ఓటీటిలో చూడడం అలవాటు పడిపోయారు.

అయితే సీజన్ -7 ని టీవీలో చూసేవారికన్నా ఓటిటి అయినా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఓటిటి సెకండ్ సీజన్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది బిగ్ బాస్ షో.. బిగ్ బాస్ టీం ఎంత ప్రయత్నిస్తున్న ఓటిటి సీజన్ 2 అనేసరికి కంటిస్టేన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఓటిటి ఫస్ట్ సీజన్లో ఆల్రెడీ తీసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు.. ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సీజన్-7 లో పాల్గొన్న సెలబ్రిటీలను ఓటిటి సీజన్-2 లో కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పావని, యావర్, బోలే షావలి ఇతరత్రా వారికి అవకాశం ఉంటుందట.. అయితే వీరి వరకు ఓకే ఉన్నప్పటికీ కొత్త కంటెస్టెంట్లకు ఓటిటి సీజన్ 2 అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. రెమ్యూనరేషన్ పెంచి ఇస్తామన్నా సరే ఇందులో రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. హోస్టుగా నాగార్జున కూడా కష్టమేనని తెలియడంతో సెకండ్ సీజన్ త్వరగా స్టార్ట్ చేయాలని ఆలోచనని బిగ్ బాస్ సంస్థ విరమించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అసలు బిగ్ బాస్ సీజన్ ఓటిటి -2 ఉంటుందా లేదా అనే విషయం పైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: