టీవీ: పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ లేడీ కమెడియన్.. వరుడు ఎవరంటే..?
లేడీ కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన పవిత్ర మరొకవైపు యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తోంది. పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.. ప్రేమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారని గతంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే అక్కడ చూపించినటువంటి వ్యక్తినే పవిత్ర నిజ జీవితంలో కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నది.
తాజాగా తన ప్రియుడు తరుణ్ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ గత కొంతకాలంగా ఈ క్షణం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానంటూ తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.. పవిత్ర బాయ్ ఫ్రెండ్ సంతోష్ కూడా ఒక యూట్యూబర్.. గత కొద్ది రోజులుగా పవిత్రతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు అని తెలిసి అభిమానుల సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వీరి వివాహ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు కేవలం కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు ఈ ఫోటోలను చూస్తే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.