టీవీ: పవన్ కళ్యాణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన సీరియల్ యాక్టర్..!
ప్రముఖ సీరియల్ నటి యమునా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పదుల సంఖ్యలో సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె సినిమాలలో అవకాశాలు తగ్గడంతో వెండితెరను వదిలి బుల్లితెర పైకి అడుగు పెట్టింది. ఇక ఈమె తాజాగా పవన్ కళ్యాణ్ తో తనకు ఎదురైన ఒక ఘటన గురించి చెప్పుకొచ్చింది యమునా మాట్లాడుతూ... ఒకరోజు నేను చిరంజీవి గారి ని కలవడానికి ఆయన ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని అనుకోకుండా కలవాల్సి వచ్చింది అయితే అప్పటికి పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు.
హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు కేవలం చిరంజీవి గారితోనే మాట్లాడడానికి వెళ్తే.. అయితే అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారితో ఏకంగా 30 నిమిషాలు మాట్లాడిన అవకాశం లభించింది. ఆయన ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడాడు .ఇప్పటివరకు కూడా నేను మర్చిపోలేక పోతున్నాను. ముఖ్యంగా నా జీవితంలో అదొక మెమరీ లాగా నిలిచిపోయింది అంత నెమ్మదిగా ఉండే ఆయన నేడు రాజకీయాల్లో అంత పవర్ ఫుల్ గా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇక ఆయన స్వభావం అప్పట్లో కూడా అలాగే ఉండేదేమో నేను గమనించలేదు అంటూ యమునా పవన్ కళ్యాణ్ పై కామెంట్లు చేసింది. యమున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.