టీవీ: భోళా శంకర్ లో ఆ అమ్మాయిని వద్దని శ్రీముఖి తీసుకున్న చిరంజీవి.!!

Divya
ఆగస్టు 11వ తేదీన చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది.అయితే తాజాగా ఈ సినిమాలో శ్రీముఖి కూడా ఒక పాత్ర కోసం తీసుకోవడం జరిగింది అయితే చిరంజీవి శ్రీముఖిని ఈ చిత్రంలో సజెషన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉన్నాయట. అయితే ఈ కామెడీ సన్నివేశాలలో కమెడియన్స్ ని పెడితే బాగుంటుందని డైరెక్టర్ మెహర్ రమేష్ అనుకోక ఈ పాత్ర కోసం మొదట జబర్దస్త్ కమెడియన్ రోహిణి అనుకున్నారట. కానీ ఈ విషయం చిరంజీవికి చెబితే వామ్మో ఆ అమ్మాయి అయితే కామెడీ చేస్తే నేను ఆశ్చర్య పోవాల్సిందే. అంతేకాకుండా ఆ అమ్మాయి కామెడీ ముందు నేను అసలు నిలవలేను అంటూ తెలియజేశారట.

దీంతో మెహర్ రమేష్ చిరంజీవి వద్దనడం తో రోహిణి పాత్రల శ్రీముఖి ని తీసుకున్నట్లు తెలియజేశారు.కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఈ పాత్రకి రోహిణి మాత్రమే న్యాయం చేయగలరని సమాచారం.. రోహిణి వద్దని శ్రీముఖిని తీసుకోవడం వెనుక వేరే కథ ఉందని కావాలని చిరంజీవి ఆ అమ్మాయిని తీసేసారంటూ పలువురు నిటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం మాత్రం రోహిణి మిస్ అయ్యిందని ఆమె అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. రోహిణి ఇటీవల కాలంలో పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీ కమెడియన్ గా మారిపోయింది. ఒకవైపు జబర్దస్త్ లో నటిస్తూనే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడికి ఇలా సినిమా అవకాశాలు వస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: