ఎల్లో మీడియా: తప్పు చేయనేల.. లెంపలు వేయనేల?

Chakravarthi Kalyan
ఇటీవల మహా టీవీ తెలంగాణ హై కోర్టుకు క్షమాపణ చెప్పింది. వైఎస్ వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హై కోర్టు  మే 31 వరకు గడువు ఇచ్చింది. ఈ కేసులో సీబీఐని వివిధ రకాల ప్రశ్నలు అడిగింది. అందులో కొన్ని ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. కొన్ని ఊహగానాలు మాత్రమే అన్నట్లు దానిపై కోర్టు మండి పడినట్లు తెలుస్తోంది. కోర్టుకు ఆధారాలు మాత్రమే కావాలని చెప్పినట్లు సీబీఐ తప్పుడు సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే హై కోర్టు 31 వరకు అవినాష్ రెడ్డికి బెయిల్ పొడిగించిన విషయంపై  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ లో హై కోర్టు జడ్జి చెప్పినా తీర్పు తప్పని అది సరికాదని వ్యాఖ్యనించడంపై కోర్టు మండిపడింది. వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై  హై కోర్టు జడ్జిలపై కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని జడ్జి వ్యాఖ్యానించారు.

ఏబీఎన్, మహా టీవీ ఛానళ్లలో జరిగిన చర్చల వీడియోలను తెలంగాణ హై కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. టీవీ చర్చల్లో కోర్టులపై జడ్జిలపై చేసిన వ్యాఖ్యలపై కలత చెందినట్లు పేర్కొన్నారు. టీవీ ఛానళ్లలో జరిగిన చర్చలు కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకే వస్తాయని జడ్జి వ్యాఖ్యానించారు. ఒకానొక సందర్భంలో కేసు నుంచి తప్పుకోవాలని భావించినట్లు పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఈ ఉద్యోగానికి వచ్చిన సమయంలో చేసిన ప్రమాణం గుర్తుండి ఆగిపోయానని తెలిపారు. కానీ ఆ రెండు చానళ్లు వ్యవహరించిన తీరును మాత్రం చాలా మంది తప్పు పట్టారు. దీంతో మహాటీవీ ఓనర్ కోర్టుకు క్షమాపణ చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చారనే వివాదాస్పద వ్యాఖ్యలు టీవీ చానళ్లలో జరగడం న్యాయవ్యవస్థపై దాడిగా చాలా మంది న్యాయ నిపుణులు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: