
టీవీ: బుల్లితెర నుంచీ హీరోయిన్లుగా మారిన సెలబ్రిటీలు వీళ్లే..!
కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సక్సెస్ అయ్యి కెరీర్లో బాగా రాణిస్తున్నారు. ఈ హీరోయిన్స్ కి స్టార్ హీరోల పక్కన కూడా ఆఫర్లు వస్తూ మంచి విజయాలను అందిస్తున్నాయి. అంతేకాదు వీరి రెమ్యునరేషన్ కూడా భారీ గానే ఉంటుంది. ఇకపోతే అలా బుల్లితెర నుండి వచ్చి వెండితెరపై సక్సెస్ అయిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
కలర్స్ స్వాతి:
బుల్లితెర మీద వచ్చిన కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా చేసిన స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఆమె హీరోయిన్గా మారి స్వామి రారా, కార్తికేయ లాంటి చిత్రాలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
హన్సిక:
ప్రముఖ గోవా బ్యూటీ హన్సిక కూడా మొదటిసారి తన కెరియర్ను బుల్లితెర పైనే ప్రారంభించింది. అక్కడ తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ఇటీవలే తాను ప్రేమించిన వ్యక్తిని కూడా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
మృనాల్ ఠాకూర్:
సీతారామం సినిమాతో ప్రేక్షకులలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది.