టీవీ: సుధీర్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

Divya
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు స్టార్ కమెడియన్గా పేరు సంపాదించడమే కాకుండా హీరోగా కూడా మారి తన సత్తా చాటుతున్నారు. మరి కొంతమంది కమెడియన్లు మాత్రం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ కమెడియన్స్ సైతం వెండితెర పైన బిజీగా ఉండడంతో జబర్దస్త్ షో పైన ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇతర చానల్స్ లో కూడా పలు కామెడీ షోలు కూడా భారీగానే పెరిగిపోయాయి.

జబర్దస్త్ నుంచి మొదట నాగబాబు బయటికి రావడంతో ఆ తర్వాత చమ్మక్ చంద్ర ,కిరాక్ ఆర్పి తదితరులు కమెడియన్సు సైతం గుడ్ బై చెప్పేశారు. ఇక రోజాకు కూడా మంత్రి పదవి రావడంతో ఈ షో నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత సుధీర్ హైపర్ ఆది పలు సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ షో ని విడడం జరిగింది.. స్టార్స్ కమెడియన్స్ లేకపోవడంతో జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. పూర్వ వైభవం తేవడానికి మేకర్స్ చాలానే కష్టపడుతున్నారని చెప్పవచ్చు.

ఎలాగోలాగా కష్టపడి గెటప్ శ్రీను అన్న తిరిగి తీసుకువచ్చిన హైపర్ ఆది వచ్చిన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది.. ప్రస్తుతం సుధీర్ హీరోగా బిజీగా ఉన్న.. జబర్దస్త్ లో తాజాగా హీరోయిన్ సదా అని జడ్జిగా తీసుకురాబోతున్నట్లు ఒక ప్రోమోను విడుదల చేశారు. దీంతో పూర్వ వైభవం వస్తుందని ఆడియన్స్ సైతం అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.. ఇక కృష్ణ భగవాన్ ప్లేసులో సదా జడ్జిగా రాబోతోంది. అలాగే సుధీర్ సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ సుధీర్ణ కనీసం నెలలో ఒకరోజైనా ఈ ఎపిసోడ్కి తీసుకురావాలని జబర్దస్త్ యాజమాన్యం తీసుకోబోతున్న ఈ నిర్ణయానికి సుధీర్ ఒప్పుకుంటాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: