టీవీ: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం దక్కించుకున్న సీరియల్ నటి..!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవడానికి చాలామంది సీరియల్స్ లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు సినిమాలలో బుల్లితెర హీరోయిన్లకి కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తూ వారికి కూడా ఒక పేరును తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీరియల్ నటిని తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ లో గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రామోజీరావు ఫిలిం సిటీ లో హైదరాబాదులో ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలోనే గోవాకి వెళ్లబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా రెండవ హీరోయిన్ గా సాయి పల్లవి కూడా సెలెక్ట్ అయిందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి భార్య పాత్రలో ఒక సీరియల్ యాక్టర్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.  ఇప్పటికే రెండు సినిమాలలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే ఆమె దురదృష్టం కారణంగా వేరే వాళ్లకు అవకాశం వెళ్లిపోయిందట.  అయితే ఇప్పుడు మళ్లీ తనకు సినిమాలో అవకాశం లభించింది అని చెప్పుకొస్తోంది ఆ ముద్దుగుమ్మ.. ఇక ఆమె ఎవరో కాదు చైత్ర రాయ్..ఇప్పటికే పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశాలు రావడంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: