విష్ణు ప్రియ తల్లికి ఈ స్టార్ హీరోయిన్స్ కి.. బంధం ఏమిటంటే..?

Divya
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన విష్ణు ప్రియ తన యాంకరింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. మొదటిసారిగా పోవే పోరా అనే షో తో టాలీవుడ్ బుల్లితెర పైన అడుగు పెట్టిన విష్ణు ప్రియ ఈ షోలో తన మాటలతో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. ఈ షో ద్వారా కొన్ని షోలలో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. విష్ణు ప్రియ తన కెరీర్లు మలయాళం కన్నడ తమిళ్ వంటి భాషలలో కూడా నటించింది.

కానీ అక్కడ కూడా సరైన అవకాశాలు అందుకోలేకపోవడంతో టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు ఎందుకో కెరియర్ సజావుగా సాగలేదు. తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా డాన్స్ ,వీడియోలతో హాట్ ఫోటోలతో సైతం బాగా రచ్చ చేస్తూ ఉంటుంది. వెండితెర పైన అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ను సైతం బయట పెడుతూనే ఉంది విష్ణు ప్రియ.

ఏదైనా కొత్త సినిమా విడుదలవుతే చాలు అందులో వచ్చే కొత్త పాటలకు తన డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇటీవలే ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో కూడా నటించింది విష్ణు ప్రియ.. అసలు విషయంలోకి వెళ్తే విష్ణు ప్రియ తల్లి గురించి ఒక విషయాన్ని పంచుకుంది.. విష్ణు ప్రియ తల్లి మరణించడంతో ఆమెకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అయింది. విష్ణు ప్రియ తల్లి ఒక హెయిర్ డ్రెస్సర్.. స్టార్ హీరోయిన్ అయిన శ్రీయ, ఆర్తి అగర్వాల్ కు కూడా హెయిర్ డ్రసర్ గా పని చేసిందని తన తల్లికి టాలెంట్ ఉన్న ఇలా ఎందుకు ఉండిపోయిందో తెలియలేదంటూ బాధపడింది. ఎన్నో కష్టాలు పడ్డ కొంత సంపాదించి సెటిల్ అయ్యారని తెలుపుతోంది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: