టీవీ: సుజాత - రాకేష్ మధ్య ఏమైంది.. పెళ్లయిన నెల రోజులకే అలా..?

Divya
జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి తెలుగు బుల్లితెర కామెడీ షోలలో భారీ పాపులారిటీ దక్కించుకున్న సుజాత , రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ షో ద్వారా ఎంతో మంది ఎంతోమంది తమను తాము నిరూపించుకున్నారు. అలాగే ఈ షో ద్వారానే అనేకమంది వెండితెరపై అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ సుజాత కూడా ఇటీవల జబర్దస్త్ షోలో భారీ పాపులర్ దక్కించుకొని ఇప్పుడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ జంట ఒక స్కిట్లో భాగంగా సుజాతపై రాకింగ్ రాకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నావా?  అని అడగగా.. మాది పవిత్రమైన ప్రేమ అంటూనే యూటర్న్ తీసుకున్నారు.. బొంగులో లవ్ అండి.. బొంగులో లవ్ .. ప్రేమించేదాకా .. పెళ్లి చేసుకునేదాకా .. టార్చర్ పెట్టిందంటూ వ్యాఖ్యానించాడు.  ఈ వ్యాఖ్యలపై అభిమానులు కూడా రాకేష్ పై మండిపడుతున్నారు.  అంతే కాదు వీరిద్దరికి ఏమైంది అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాస్తవానికి జబర్దస్త్ స్కిట్స్ లో వల్గారిటీ మనం పక్కన పెట్టినట్లయితే అందులో రాకేష్, సుజాత జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా వీరి జంటని చూసిన వాళ్లంతా రియల్ లైఫ్ జోడి అయితే బాగుంటుందని కూడా చూడాలనుకున్నారు.  అన్నట్లుగానే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఇలా రాకేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మండిపడుతున్నారు స్కిట్ అయినా సరే ఎటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. నెలరోజులు దాటింది ఇలాంటి సమయంలో శుభం పలకాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అంటూ సూచిస్తున్నారు. మరికొంతమంది అందరూ చూసేలా ఆమెను అవమానించేలా ఇలాంటి స్కిట్లు చేయవద్దు అని కూడా రాకేష్ కు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా స్కిట్ కోసం తమ మధ్య ఉన్న ఇష్టాన్ని కూడా ఇలా మార్చుకోవడం అంతా బాగాలేదని అభిమానులు కోప్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: