టీవీ: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సింగర్ మంగ్లీ..!!

Divya
ఒకప్పుడు పలు టీవీ కార్యక్రమాలలో కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ మంగ్లీ. ఇప్పుడు తెలుగులోనే టాప్ సింగర్ గా తన కెరీయర్ ను కొనసాగిస్తోంది. కేవలం తెలుగు పాటలే మాత్రమే కాకుండా కన్నడ పాటలు కూడా పాడుతూ సౌత్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటోంది. విభిన్నమైన గాత్రం కేవలం మంగ్లీకి మాత్రమే సొంతమని చెప్పవచ్చు ఒక పాటను ఆమెకు అప్పగిస్తే జనాలలోకి ఆ పాటను ఎలా తీసుకువెళ్లాలి అనేది ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె పాట అత్యంత పాపులారిటీ సంపాదిస్తూ ఉంటుంది.
ఇక పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ , ఇతర పాటలు  పాడిన ఈమె పరిస్థితికి తగ్గట్టుగా తన గొంతు మార్చి పాడడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పవచ్చు. గతంలో ఒక్కో పాటకి రూ.40 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె ఇప్పుడు పారితోషకం ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.. దాదాపుగా ఒక్కో పాటకి రూ.20 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా పాటలను ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నది.
మంగ్లీ ప్రైవేట్ సాంగులతో పాటు యూట్యూబ్ ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయలు ఆదాయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె యూట్యూబ్ ఛానల్స్ లో వందలాది మిలియన్ వ్యూస్ ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సింగర్ గా సినిమాలలో పాటలు పాడి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవడంతోపాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు గడిచిన కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. ఒకవైపు సింగర్ గా తన హవా కొనసాగిస్తూనే మరొకవైపు ఇలా సినిమాలలో నటిస్తూ ఉండడంతో ఈమె అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: