టీవీ: జబర్దస్త్ కి మరొక యాంకర్ గుడ్ బై..!!

Divya
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతోమందికి వెండితెర పైన బుల్లితెర పైన లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు .అలా ఎంతోమంది కమెడియన్స్ ,యాంకర్స్ సినిమాలలో బాగా నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ షోకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. జబర్దస్త్ షో కి పోటీగా ఎన్నో షోలు వచ్చినప్పటికీ.. అవన్నీ కనుమరుగైన ఈ షో మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ షోలో పనిచేసిన యాంకర్లు కమెడియన్లు సినిమాలలో బాగా రాణిస్తున్నారు.
అలా అనసూయ, రష్మీ, సుడిగాలి సుదీర్, చమ్మక్ చంద్ర చలాకి చంటి తదితరులు ఉన్నారు. అయితే జబర్దస్త్ గురించి ఎప్పుడూ ఏదో వివాదాస్పందం అవుతూ ఉంటుంది. జబర్దస్త్ షో నుంచి యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ తప్పుకోవడంతో ఆమె స్థానంలో సౌమ్యరావు కొత్తగా తీసుకువచ్చారు. అయితే సౌమ్య కూడా జబర్దస్త్ షో నుంచి తప్పుకోవాలని ఆలోచనలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె పైన బాడీ షేమింగ్స్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారని సమాచారం. ఈ విషయంపైనే అనసూయ కూడా తప్పుకోవడానికి కారణమని వార్తలు బయటకి వినిపించాయి.
ఇందులో ఉండే కొంతమంది కమెడియన్స్ ఈమె బాడీ షేవింగ్ పైన హద్దు మీరి కామెంట్స్ చేస్తూ ఉండడంతో పాటు తన మీద డబుల్ మీనింగ్ డైలాగులు వంటి వాటితో ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు సౌమ్య సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. దీంతో సౌమ్య జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.దీంతో జబర్దస్త్ షోకు మళ్లీ కష్టాలు తప్పడం లేదని వార్తలు వినిపి స్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం హైపర్ ఆది కూడా ఈ షో కి గుడ్ బై చెప్పబోతున్నాడు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెర పైన జబర్దస్త్ షోలో కనిపించలేదు. మరి సౌమ్య రావు విషయంలో ఆమె క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: