లాజికల్ డిస్కషన్: "గ్లాసు బియ్యం కోసం" బిగ్ బాస్ లో గొడవ !

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 లో సక్సెస్ ఫుల్ గా 11 వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం 12 వ వారంలో ఉన్నాము... ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు నామినేషన్స్ కూడా జరిగిపోయాయి. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ గా ఉన్న రేవంత్ మరియు కీర్తి మినహాయించి... అందరూ నామినేషన్ లో ఉండడం గమనార్హం. ఈ వారం కనుక సేవ్ అయితే వాళ్ళు టాప్ 5 లో ఉండడానికి మరింత అర్హత సాధించినట్లు అవుతుంది. ఇక నిన్న ఎపిసోడ్ లో హౌస్ లో జరిగిన ఒక చర్చ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది. ఈ చర్చ కిచెన్ ఏరియాలో జరిగింది.. అక్కడ రేవంత్, కీర్తి, శ్రీహన్ మరియు ఇనాయాలు ఉన్నారు.
ప్రస్తుతం హౌస్ లో ఉన్నది 9 మంది మాత్రమే. మెరీనా ఉన్నప్పుడు హౌస్ లో 10 మంది ఉండేవారు, వారికి తినడానికి వంటకు 5 గ్లాసుల రైస్ ను వాడేవారు. కానీ మెరీనా ఎలిమినేట్ అవడంతో ఇప్పుడు కెప్టెన్ మరియు రేషన్ మేనేజర్ గా ఉన్న రేవంత్ నాలుగు గ్లాసుల రైస్ సరిపోతుందని భావించి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ నిర్ణయంతో అక్కడే ఉన్న కీర్తి, శ్రీహన్ మరియు ఇనాయాలు ఏ మాత్రం ఏకీభవించలేదు. 9 మంది ఉన్నప్పుడు నాలుగు గ్లాసులు ఎలా సరిపోతుంది ? ఇంకో గ్లాసు వేయొచ్చు కదా అంటూ వారు ముగ్గురూ రేవంత్ తో వాదిస్తున్నారు.
కానీ ఎప్పటిలాగే రేవంత్ ఎవరిమాటా వినకుండా తాను మొండిగా వాదిస్తున్నాడు. పైగా ఆ నాలుగు గ్లాసుల అన్నం మీరు మాత్రమే తినండి... నేను ఆల్రెడీ మిగిలిన అన్నం తింటాను అన్నాడు. ఎందుకు అలా తినడం ఇంకో హాఫ్ గ్లాస్ వేసినా నువ్వు కూడా ఫ్రెష్ గా తినొచ్చు కదా అంటూ శ్రీహన్ చెబుతున్నాడు. ఇలా ఆ చర్చ మాత్రం రేవంత్ నే చెడుగా చూపించింది అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న వస్తువులను పొదుపుగా వాడడం మంచి పద్దతే. కానీ ఎటువంటి అవసరం అన్నది కూడా పరిగణలోకి తీసుకుని రేవంత్ నిర్ణయాలు తీసుకుంటే మంచిదని ప్రేక్షకులు భావిస్తున్నారు.        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: