టీవీ:ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!!

Divya
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో జబర్దస్త్ నటుడు గడ్డం నవీన్ కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. జబర్దస్త్ షోకు ప్రస్తుతం గడ్డం నవీన్ దూరమైనప్పటికీ ఈ షో కి మళ్లీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. గడ్డం నవీన్ అశోక్ సినిమాలోని మొదటి సీన్లో ఎంట్రీ ఇవ్వడం జరిగిందట. అయితే అప్పటికి ఇప్పటికీ గడ్డం నవీన్ లుక్ పూర్తిస్థాయిలో మారిపోవడంతో చాలామంది ఈ నటుడిని గుర్తుపట్టలేక పోతున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలు గడ్డం నవీన్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన అశోక్, కిక్ -2, సైరా నరసింహారెడ్డి ధ్రువ వంటి చిత్రాలలో నటించానని తెలియజేశారు సైరా సినిమాలో చిరంజీవి తనని ప్రశంసించారని గడ్డం నవీన్ తెలియజేశారు. ఆచార్య సినిమాలో మంచి సీన్లు చేశానని కానీ ఎడిటింగ్లో పోయిందని తెలియజేయడం జరిగింది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి 14 సంవత్సరాల తర్వాత ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ని నేను కలిశానని తెలిపారు. రామయ్య వస్తావయ్య సినిమాలో నటించిన మంచి పాత్ర కాదని గడ్డం నవీన్ తెలియజేశారు.

రామయ్య వస్తావయ్య షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తనని గుర్తుపట్టి మాట్లాడారని.. ఆ తరువాత ఢీ షోకు తారక్ జడ్జిగా హాజరైన సమయంలో కూడా తారక్ తన చేయి పట్టుకొని వెళ్లారని గడ్డం నవీన్ తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ మెమొరీ చాలా ఎక్కువగా ఉంటుందని గడ్డం నవీన్ తెలియజేశారు.అయితే గడ్డం నవీన్ కు క్రేజ్ పెరగకపోవడానికి కారణం మాత్రం ఆయన సినిమాలలో పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రాకపోవడమే అని చెప్పవచ్చు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అంతంత మాత్రమే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: