టీవీ: జబర్దస్త్ జడ్జ్ కృష్ణ భగవాన్ యొక్క పారితోషికం ఎంతంటే..?

Divya
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈ షో లో కొత్తగా వచ్చిన జడ్జ్ ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ ఈ షోలో సందడి చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక జడ్జిలుగా ఇంద్రజ ,కృష్ణ భగవాన్ గత రెండు మూడు వారాల నుంచి కంటిన్యూగా కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఇకమీదట కృష్ణ భగవాన్ కచ్చితంగా జబర్దస్త్ లో పర్మినెంట్ జడ్జి అయ్యే అవకాశం ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే జబర్దస్త్ లో ఒక పర్మినెంట్ జడ్జి సీట్లో స్టార్ కమెడియన్ స్థిరపడ్డారని చెప్పవచ్చు.

ఈ మేరకు కృష్ణ భగవాన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనే అంశం చర్చినియంశంగా మారుతోంది. అయితే మల్లెమాల మరియు కృష్ణ భగవాన్ సన్నిహితుల సమాచారం ప్రకారం కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కు రూ.1.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక జడ్జిగా ఇంద్రజాకు మాత్రం  రూ.2.5 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక కృష్ణ భగవాన్ గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి కమెడియన్ గా కూడా పేర్కొన్నారు ఇప్పుడు మళ్లీ తాజాగా బుల్లితెరపై అంతే కామెడీని పంచుతూ అభిమానులను సైతం చాలా సంతోష పరుస్తూ ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో అంతగా సినిమాలలో కనిపించలేదు కృష్ణ భగవాన్. అల్లరి నరేష్ ,కృష్ణ భగవాన్ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.వీరిద్దరూ చేసే కామెడీ సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు సైతం కడుపుబ్బ నవ్వుతూ ఉంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా దర్శకులు, రచయితలకు కథలు కూడా రాసి ఇచ్చేవారట కృష్ణ భగవాన్. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలకు మాత్రం కథలు రాయలేకపోవడంతో సినిమా ఆఫర్లు రాలేకపోవడంతో బుల్లితెర పైన సందడి చేస్తున్నట్టుగా సమాచారం కృష్ణ భగవాన్. మరి కృష్ణ భగవాన్ ఎంతవరకు జబర్దస్త్ లో ఉంటారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: