టీవీ: జబర్దస్త్ షోలో అరాచకాలు నిజమేనా...?

Divya
జబర్దస్త్ కామెడీ షో లో ఎంతోమంది కమెడియన్ లు అందరిని అలరిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం బాగా పాపులర్ అయింది. మొదట్లో జడ్జిలుగా నాగబాబు, రోజా ఉండేవారు. ఆ తరువాత ఇందులో నుంచి జడ్జిలు ఒక్కొక్కరుగా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇందులోని కమెడియన్స్ కూడా ఒక్కొక్కరు ఈ ప్రోగ్రాంను వదిలి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా ఇలా ఉండగా కిరాక్ ఆర్పి జబర్దస్త్ పై పలు ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఇక జబర్దస్ ప్రోగ్రాం గురించి అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి కూడా పలు వాక్యాలు చేయడం జరిగింది.
ఇక ఈ విషయంపై రాకేష్ మాస్టర్ స్పందించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో చేసే అరాచకాలు బయట పెట్టాడు ఆర్పీ చెప్పిందంతా నిజమే అని తెలిపారు. అక్కడ నేను కొన్ని రోజులు ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నిజంగానే అక్కడ పెట్టే భోజనం చాలా దరిద్రంగానే ఉంటుంది అని తెలిపారు. నేను భాస్కర్ టీం లో చేసేవాడిని . నన్ను భాస్కర్ బాబాయి అని పిలుస్తూ ఉండేవారు. మా బాబాయిని సరిగ్గా చూసుకోండి భోజనం మంచిగానే పెట్టండి అని చెబుతూ ఉండేవారు. ఈ షోలోకి నేను రమ్మంటేనే వచ్చారు అని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని భాస్కర్ తెలియజేశారని తెలిపారు రాకేష్ మాస్టర్.
కానీ ఒకరోజు భాస్కర్ మాత్రం రాలేదు భోజనం చాలా లేట్ అయింది అయితే నేను వెళ్లి అక్కడ లైన్ లో నిలుచున్నాను.. అక్కడ భోజనాన్ని చూసి చాలా దరిద్రంగా ఉందని ఆ సమయంలో తనకి ఏమి అర్థం కాలేదని తెలిపారు. కానీ కిరాక్ ఆర్పి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది అక్కడ ఫుడ్ బాగుంటే బయట నుంచి ఎందుకు తెస్తుంటారు. భాస్కర్ కూడా తనకి సపరేట్గా ఫుడ్డు తెప్పించుకుంటూ ఉంటాడని తెలిపారు. ఇక అంతే కాకుండా డైరెక్టర్ ప్రసాద్ కి కూడా అమ్మాయిలు అంటే చాలా పిచ్చి అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: